సోమవారం, జనవరి 03, 2011

పూచే పూలలోనా - గీత (1973)

ఎవడండీ వీడు కొత్త సంవత్సరం మొదలే ఇంత విషాద గీతాన్ని పరిచయం చేస్తున్నాడు అని కోప్పడకండి. విధికి పాతా కొత్తా పండగా పబ్బమా ఏమీ తెలియదు నిశ్శబ్దంగా కదిలే కాలంతోపాటు సాగుతూ అదను చూసి గాయం చేసి ముందుకు వెళ్ళిపోతుంది. ఆ గాయానికి ఇలాంటి మధుర గేయాల లేపనంపూస్తూ మంచి రోజులకోసం ఎదురుచూడటం తప్ప ఒకోసారి ఏమీ చేయలేము. మనసు విషాదంగా ఉన్నపుడు హుషారునిచ్చే పాటలు పాడుకోవాలి గానీ ఇంకా విషాదాన్ని పెంచేపాటలు ఎందుకు బాబు అనేవారూలేకపోలేదు. కానీ ఒకోసారి “బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్” అన్న దేవదాసు మాటలు గుర్తుచేసుకోక తప్పదు.

ఎలాంటి భావాన్నైనా తన స్వరంలో అద్భుతంగా పలికించి శ్రోతలను తన్మయత్వంలో ముంచేసే బాలుగారు ఇలాంటి పాటలు పాడే అవకాశం వచ్చినపుడు తన స్వరంతో ఆపాటలో మరిన్ని భావోద్వేగాలను రంగరించి మన హృదయ కవాటాలను తెరచి సరాసరి అందులోకి ఒంపేస్తున్నారా అనిపించేలా పాడేస్తారు. కె.వి. మహదేవన్ గారి స్వరసారధ్యంలో జికె మూర్తిగారు రచించిన ఈ పాట గీత (1973) అనే చిత్రంలోనిది. ఇక్కడ ఇచ్చిన ఇస్నిప్స్ ప్లగిన్ లో కానీ లేదంటే చిమట మ్యూజిక్ లో ఇక్కడ నొక్కి కానీ వినవచ్చు.

చిత్రం: గీత (1973)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: జి.కె.మూర్తి
గానం: బాలు గారు.

పూచే పూలలోనా.. వీచే గాలిలోనా
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే..
పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే ..
ఓ చెలీ .... ఓ చెలీ ....

నా ఊహలో నీవు ఉయ్యాలలూగేవు
నా ఊపిరై నీవు నాలోన సాగెవు
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు నా సర్వమే .. నీవు నా స్వర్గమే
నీవు లేకున్న ఈ లోకమే... శూన్యమే

పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే
ఓ చెలీ .... ఓ చెలీ ....

ఎన్నో జన్మల బంధము మనదీ..
ఎవ్వరు ఏమన్నా ఇది వీడనిదీ..
నీవు నా గానమె .. నీవు నా ధ్యానమే
నీవు లేకున్న ఈ లోకమే శూన్యమే

పూచే పూలలోన.. వీచే గాలిలోన
నీ అందమే దాగెనే .. నీ అందెలే మ్రోగెనే

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.