శుక్రవారం, ఆగస్టు 11, 2017

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ...

లక్ష్మీ పూజ చిత్రంలో ఒక చక్కని పాట ఈ శ్రావణ శుక్రవారం రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : లక్ష్మీ పూజ (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం :  వీటూరి
గానం : జానకి

శ్రీ లక్ష్మీ... జయలక్ష్మీ.. 
సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ
సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ

పాలకడలిలో ప్రభవించినావు
మురిపాల మాధవుని వరియించినావు
పాలకడలిలో ప్రభవించినావు
మురిపాల మాధవుని వరియించినావు
శ్రీపతి హృదయానా...
శ్రీపతి హృదయాన కొలివైతివమ్మా
నా పతి పాదాల నను నిలుపవమ్మా

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ

అన్ని జగాలకు మూలము నీవే ఆదిలక్ష్మివమ్మా
పాడిపంటలను ప్రసాదించు నవ ధాన్యలక్ష్మివమ్మా
భీరులనైనా ధీరులజేసే ధైర్యలక్ష్మివమ్మా
జగతికి జయమును కలిగించే గజలక్ష్మివి నీవమ్మ
వంశము నిలిపే పాపలనిడు సంతానలక్ష్మివమ్మా
కార్యములన్నీ సఫలము జేసే విజయలక్ష్మివమ్మా
జనులకు విధ్యాభుద్దులు నేర్పే విద్యాలక్ష్మి నీవమ్మా
సర్వ సౌభాగ్యములను సంపదనిచ్చే భాగ్యలక్ష్మివి నీవమ్మా

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ
కరుణించ రావే మహాలక్ష్మీ
మము కరుణించ రావే మహాలక్ష్మీ


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.