సింధుభైరవి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సింధుభైరవి (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : కె.జె.ఏసుదాస్
మోహం అనెడు హాలాహలమిదె
మండు మాడ్చు హృదయం
వ్యసనం అనెడు చెలియ బింబం
వెతలు పెంచు విలయం
మోహం అనెడు మాయావతిని
నేను కూల్చి పూడ్చవలయు
కాని ఎడల ముందు నిశ్వాసములు
నిలచి పోవ వలయు
దేహం సర్వం మోహం సర్పయాగం
చేసేనహోరాత్రం
తల్లీ ఇపుడు నీవే వచ్చి
నన్ను బ్రోవవలయు వేగం
మదిలో నీదు ఆధిక్యం బలిమిని
వయసు పొగరు బాధించు
విరసమలవి శోధించు
కల తెలవారు వరకు పీడించు
ఆశ ఎదను వ్యధ చేసి వేధించె
కాంక్ష తీర్చునది
దీక్ష పెంచునది
నీవే దేవీ.. నీవే దేవీ
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.