డాన్స్ మాస్టర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : డాన్స్ మాస్టర్ (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా..
కలలే కన్ను గీటగా.. కసిగా
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడి ఆరకున్నది
నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే
తెలిపింది కన్నె గళమే మనువాడలేదని
ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే
మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో
ఒరిగినా ఒదిగినా హత్తుకొనే ప్రేమ
నీ పిలుపే పిలిచే వలపై పెదవుల్లో దాగి
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా..
కలలే కన్ను గీటగా.. కసిగా
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
తారాడు తలపులెన్నో నీలాల కురులలో
తనువు మరచిపోయే మరులే పొంగే
ముద్దాడసాగె పెదవి ఒక మూగ భావమే
చాటు కవితలన్నీ అనురాగాలే
పెదవులే విచ్చిన మల్లె పూల వాసన
సొగసులే సోకినా వయసుకే దీవెన
వీరెవరో జత కోకిలలో.. ఎద లేడై లేచి
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా...
కలలే కన్ను గీటగా.. కసిగా
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
2 comments:
అర్థం పర్థం లేని బుచికి పాట.'వీరెవరో జత కోకిలలో ఎదలేడై లేచి'. ఏమిడిది ఈ బూడిద.
డబ్బింగ్ పాటలకుండే పరిమితులకు లోబడి చక్కగా వ్రాసిన పాటండీ ఇది ఈకాలపు చాలా పాటలకన్నా మెరుగైనది. మీరు కోట్ చేసిన లైన్ పంక్చుయేషన్స్ తో రాస్తే బహుశా మరింత అర్ధమై ఉండేదేమో. శ్రద్దగా పాట వింటే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.