గురువారం, ఆగస్టు 24, 2017

మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా..

మంత్రిగారి వియ్యంకుడు చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మంత్రిగారి వియ్యంకుడు ( 1983)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

మనకు దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో.. చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా..
దోస్తీ.. ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా

కాదురా ఆటబొమ్మ.. ఆడదే నీకు అమ్మ
ఎత్తరా కొత్త జన్మ.. ప్రేమ నీ తాత సొమ్మా
తెలుసుకో తెలివిగా మసలుకో
(ఉన్నదా నీకు దమ్ము దులుపుతా నీకు దుమ్ము)
అలుసుగా ఆడకు మనసుతో

ఆ ప్రేమ ధనికుల విలువలు గని
నీ వంటి ధనికులు వెలవెలమని
ఆ ప్రేమ ధనికుల విలువలు గని
నీ వంటి ధనికులు వెలవెలమని
జీవిస్తే ఫలితమేమిటి..
శ్రీరాగమున కీర్తనలు మానరా

దోస్తీ.. ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా

ప్రేమకై నీవు పుట్టు..  ప్రేమకై నీవు బ్రతుకు
ప్రేమకై నీవు చచ్చి..  ప్రేమవై తిరిగి పుట్టు
మరణమే లేనిది మనసురా..

క్షణికమే యవ్వనమ్ము.. కల్పనే జీవనమ్ము
నమ్ముకో.. దిక్కుగా ప్రేమనే
ఈ జనన మరణ వలయములనిక
ఛేదించి మమతను మతమనుకుని
ఈ జనన మరణ వలయములనిక
ఛేదించి మమతను మతమనుకుని
జీవించే మోక్షమార్గము
శ్రీరస్తననుచు దీవెనగ దొరికిన

దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా
విడిపోకు చెలిమితో చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావురా
దోస్తీ ఒకటే ఆస్తిరా.. జబరుదస్తీ చేస్తే శాస్తిరా


2 comments:

నాకు చాలా చాలా ఇష్టమైన పాటండీ..
విడిపోకు చెలిమితో
చెడిపోకు కలిమితో
జీవితాలు శాశ్వతాలు కావుర
దోస్తీ ఒకటే ఆస్తిరా

కాదురా ఆటబొమ్మ
ఆడదే నీకు అమ్మ

స్నేహం గురించీ, స్త్రీ గురించి యెంత అందం గా చెప్పారో, టేకింగ్ అంత యూత్ఫుల్ గా ఉంటుంది..థంక్యూ ఫర్ పోస్టింగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు... అవునండీ మంచి పాట నాక్కూడా ఇష్టమైన పాట.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.