మంగళవారం, ఆగస్టు 15, 2017

మాదీ స్వతంత్ర దేశం...

మిత్రులందరకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్వరపరచిన ఒక దేశభక్తి గీతాన్ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో ఆంధ్రకేసరి చిత్రంలోనిది ఇక్కడ చూడవచ్చు. పూర్తి పాట ఇక్కడ వినవచ్చు.


సంగీతం : బాలాంత్రపు రజనీకాంతరావు
సాహిత్యం : బాలాంత్రపు రజనీకాంతరావు 
గానం : టంగుటూరి సూర్యకుమారి

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి
మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి
భరతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం
భరతదేశమే మా దేశం భారతీయులం మా ప్రజలం
మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి

వింధ్య హిమవత్ శ్రీనీలాదుల సంధ్యారుణిత నవాశలు మావి
గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి
గంగా గోదావరీ సహ్యజా తుంగ తరంగిత హృదయాల్ మావి

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి

ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం
ఆలయమ్ముల శిల్పవిలాసం ఆరామమ్ముల కళాప్రకాశం
మొగల్ సమాధుల రసదరహాసం మాకు నిత్యనూతనేతిహాసం

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి

అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర
అహింసా పరమో ధర్మ: సత్యం వద ధర్మం చర
ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు
ఆది ఋషుల వేదవాక్కులు మా గాంధీ గౌతముల సువాక్కులు

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి

స్వతంత్రతా భ్రాతృత్వాలు సమతా మా సదాశయాలు
జననీ ఓ స్వతంత్ర దేవీ కొనుమా నివాళులు మావి
జననీ ఓ స్వతంత్ర దేవీ కొనుమా నివాళులు మావి

మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.