మంగళవారం, ఆగస్టు 01, 2017

చుక్కలాంటి అమ్మాయి...

అభినందన చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అభినందన (1988)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయురాజా
గానం : ఎస్.జానకి

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

ఈ పిల్లకు మనసైంది ఆ కళ్లకు తెలిసింది
ఆ పిల్లాడు వలచింది ఈ బుగ్గకు సిగ్గైంది
కళ్యాణం వైభోగం నేడో రేపో ఖాయం అన్నారు
మేళాలు తాళాలు బాణాసంచా కలలే కన్నారు
పెళ్లికి మాకేమిస్తారు..?
కొత్తబట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు
కొత్తబట్టలు కుట్టిస్తారు గుర్రం సార్టు ఎక్కిస్తారు
ఊరంతా ఊరేగిస్తారు…

చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి
ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు ఇద్దరొద్దికైనారు ముద్దుముద్దుగున్నారు
చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.