ఆదివారం, ఆగస్టు 13, 2017

ఓ పాపా లాలి జన్మకే లాలి...

గీతాంజలి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి

నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరిక
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో
చిరు చేపల కనుపాపలకిది నా మనవీ

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి

ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిలా పాడవే నా పాటని తీయనీ తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ

ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.