నాయకుడు చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ వినవచ్చు. ఈ పాట ఇళయరాజా గారి గొంతులో వినాలంటే తమిళ్ వర్షన్ ఇక్కడ వినవచ్చు.
చిత్రం : నాయకుడు (1987)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ / వెన్నెలకంటి
గానం : బాలు, శైలజ
హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్
హొయ్యా హొయ్ హొయ్ హొయ్యా హొయ్
చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్
మసకేళ చూడు.. నీకుంది తోడు
రాచిలక అందం.. రాతిరికే సొంతం
చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది.. హొయ్యా హొయ్..
అది ఏందది హొయ్
చూపులలోన చుక్కలు చూడాలి.. తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి.. తజుం తజుం తజుం
అరె...చూపులలోన చుక్కలు చూడాలి.. తజుం తజుం తజుం
నీ చేతలలోన దిక్కులు అదరాలి.. తజుం తజుం తజుం
మోజులమాటున కసికసిగా ముద్దుల దొంతరివ్వాలి
వెచ్చని వన్నెల చాటున నే ముచ్చటలాడుకోవాలి
నువ్వాడాలి.. నే పాడాలి.. పడవూగాలి హొయ్
చలాకి చిన్నది వుంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్
కోకా రైకా గుసగుసలాడేనే.. తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే.. తజుం తజుం తజుం
అహ కోకా రైకా గుసగుసలాడేనే.. తజుం తజుం తజుం
నా అల్లరి కోరిక ఎన్నెల కాసేనే.. తజుం తజుం తజుం
నీలో ఒదిగి నిలువెల్లా.. అల్లుకుపోతా సిలకమ్మ
గూటికి సేరే గువ్వల్లే.. ఒడిలో వాలవె చిట్టెమ్మ
నువ్వాడాలి.. నే పాడాలి.. పడవూగాలి హొయ్
చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
చలాకి చిన్నది వుంది.. మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..
మసకేళ చూడు.. నీకుంది తోడు హోయ్
రాసిలక అందం.. రాతిరికే సొంతం
చలాకి చిన్నది వుంది
మజాలకు రమ్మంటుంది
ఒకే ఒకటిమ్మంటుంది
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్....
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..
హొయ్యా హొయ్.. అది ఏందది హొయ్..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.