బుధవారం, ఆగస్టు 30, 2017

నీవేగా నా ప్రాణం అంటా...

చిత్రం ఓపాపాలాలి చిత్రం నుండి ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఓ పాపాలాలి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : ఏసుదాస్, చిత్ర

నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా
నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా
నీ నీడగా నే సాగేనులే నీ వెంటా

నీవేగా నా ప్రాణం అంటా
నేడు నీతోడే నా లోకం అంటా

వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నేడు కాదే
ఆలపించే పాటలోని తేనె పలుకే నీవు కావే
పలికించే నే దిద్దుకొన్న బొట్టుకొక అర్థముంది అంటానే
పల్లవించే నీ బంధనాల చందనాలు నాకు తెలుసు విన్నానే
కలిసేనులే నే కరిగేనులే నీలోన

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట

కంటి వెలుగై నిలిచిపోనా మనసులోన నిండిపోనా
కలలలోని కథను నేనై చివరి వరకు తోడు రానా
స్వర్గమేల నా గుండెలోన ఊపిరల్లె నువ్వు ఉంటే అంతేగా
నన్ను పిలిచే నీ పాటలోని మాటలోని శృతి నేనే అంతేలే
నువ్వు లేనిదే ఇక నే లేనులే ఏనాడు

నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
నీ నీడగా నే సాగేనులే నీ వెంట
నీవేగా నా ప్రాణం అంట
నేడు నీ తోడే నా లోకం అంట
  

4 comments:

వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం నేడు కాదే-పల్లవించే నీ బంధనాల చందనాలు నాకు తెలుసు విన్నానే-నేను చచ్చిపోతాను తట్టుకోలేను బాబోయ్ ఈ దిక్కుమాలిన బుచికి బుచికి సాహిత్యం చూసి.

expression anna peruto vinta vipareeta vinyaasalu avasaram ledani.adbhutamga cheppe pata

వెల్లివిరిసే వెన్నెలల్లే విరుల గంధం "నేడు కాదే" అని కాదు ...నీవు కావే అని ఉండాలి అనుకుంటా !
బుచికి బుచికి సాహిత్యం కూడా బాగుంటుందండీ ... పాటకి కూడా కందాలు, ఛందాలూ, వృత్తాలూ లాగా కొన్ని రూల్స్ ఉన్నాయి. దానిప్రకారమే వ్రాయవలసి వస్తుంది.

థాంక్స్ ఫర్ ద కామెంట్ సుజాత గారు.. చాలా కరెక్ట్ గా చెప్పారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.