ఇళయరాజా గారి స్వర సారధ్యంలో బాలు గారు పాడిన బ్రీత్ లెస్ సాంగ్ ని ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఓ పాపా లాలి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ...
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ...
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంత చేరి ఆదమరిచి ప్రేమను కొసరెను
చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్ట పగలే నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కళలే మోహన రాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ...
ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు
సందె వేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసి ముసి తలపులు తరగని వలపులు
నా చెలి సొగసులు అన్నీ ఇక నావే
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ...
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా
రేగే మూగ తలపే వలపు పంటరా
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులూ...
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలూ..
3 comments:
మాటే రానిది చిన్నా
నోటన దమ్ముగ జిలేబి నొక్కటి పాడెన్ !
వాటుగ వచ్చిన గాలే
చాటుగ తెలిపెను పలుకులు చాకుగ నోటన్ !
రేగే మూగ తలపే.... సరిచేయగలరు
థ్యాంక్సండీ.. సరి చేశాను..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.