శుక్రవారం, మే 20, 2016

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా...

ఇళయరాజా గారు స్వరపరిచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఏప్రిల్ 1 విడుదల (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మనో, చిత్ర

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా .. చేస్తానే ఏమైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను.. నన్నే అర్పిస్తాను..
వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

షోలే ఉందా ?
ఇదిగో ఇందా ....
చాల్లే ఇది జ్వాల కాదా..
తెలుగులో తీశారే బాలా..

ఖైదీ ఉందా?
ఇదిగో ఇందా..
ఖైదీ కన్నయ్య కాదే..
వీడికి అన్నయ్య వాడే..

జగదేకవీరుడి కథా.. ఇది పాత పిక్చర్ కదా
అతిలోక సుందరి తల.. అతికించి ఇస్తా పదా
ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి...

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

ఒకటా రెండా.. పదులా వందా
బాకీ ఎగవేయకుండా.. బదులే తీర్చేది ఉందా
మెదడే ఉందా.. మతి పోయిందా
చాల్లే మీ కాకి గోలా.. వేళా పాళంటూ లేదా

ఏవైంది భాగ్యం కథా? కదిలిందా లేదా కథా?
వ్రతమేదో చేస్తోందటా.. అందాక ఆగాలటా
లౌక్యంగా బ్రతకాలీ.. సౌఖ్యాలే పొందాలి...

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా
నిన్నే మెప్పిస్తాను.. నన్నే అర్పిస్తాను..
వస్తానమ్మా ఎట్టాగైనా

చుక్కలు తెమ్మన్నా తెంచుకు రానా
చూస్తావా నా మైనా.. చేస్తానే ఏమైనా

1 comments:

అయ్యా ... ఈ పాటను రాసింది శ్రీ శ్రీ సిరివెన్నెల గారు.... వేటూరి గారు కాదు... గమనించగలరు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.