బుధవారం, మే 11, 2016

దేవ మహదేవ మము బ్రోవుము...

శంకరజయంతి సంధర్బంగా ఆ సర్వేశ్వరుడ్ని స్మరించుకుంటూ భూకైలాస్ లోని ఓ చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శనం ఆర్. గోవర్ధనం
సాహిత్యం : సముద్రాల సీనియర్
గానం : ఎం.ఎల్.వసంతకుమారి

దేవ మహాదేవ మము బ్రోవుము శివా
దేవ మహాదేవ మము బ్రోవుము శివా
దేవా మహాదేవ మము బ్రోవుము శివా
భవ పాశ నాశనా భువనైక పోషణ

దేవ మహాదేవ మము బ్రోవుము శివా
భవ పాశ నాశనా భువనైక పోషణ

పరమ ప్రేమాకార నిఖిల జీవాధార
పరమ ప్రేమాకార నిఖిల జీవాధార
సకల పాప విదూర దరహాస గంభీర

దేవ మహాదేవ మము బ్రోవుము శివా

దివ్య తేజోపూర్ణ తనయులను కన్నాను
దివ్య తేజోపూర్ణ తనయులను కన్నాను
దేవతా మాతలతో పరియశము గొన్నాను
దివ్య తేజోపూర్ణ తనయులను గన్నాను
కావుమా నా సుతుల చల్లగా గౌరీశ
కావుమా నా సుతుల చల్లగా గౌరీశ
ఈ వరము నాకొసగు ప్రేమతో సర్వేశ

దేవ మహాదేవ మము బ్రోవుము శివా
భవ పాశ నాశనా భువనైక పోషణ
దేవ మహాదేవ మము బ్రోవుము శివా

 

1 comments:


దేవ మహదేవ ! హరహర !
నీవుర నీశువు జిలేబి నిగ్గుల దేల్చన్ !
కావుర మమ్ముల దయతో
నీ వరమున మమ్ము నేలు నిక్కము దెలియన్ !

జిలేబి

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.