ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే చిత్రం కోసం సిరివెన్నెల గారు వ్రాసిన ఒక అందమైన పాట ఈ రోజు విందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)
రచన : సిరివెన్నెల
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
గానం : బాలు
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా ఉన్న ఏ పోలిక
అరుదైనా చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
కన్యాదానంగా ఈ సంపద
చేపట్టే ఆ వరుడు శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా
అందరికి అందనిదీ.. సుందరి నీడ
ఇందరి చేతులు పంచిన మమత
పచ్చగా పెంచిన పూలత
నిత్యం విరిసే నందనమవదా
అందానికే అందమనిపించగా
దిగివచ్చినొ ఏవో దివి కానుక
అరుదైనా చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందోయ్ అందరిని నిలబడనీకా
ఎన్నో ఒంపులతో పొంగే ఈ నది
తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా
అల్లంత దూరాల ఆ తారక
కళ్ళెదుట నిలిచిందా ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
3 comments:
దూరాన నున్న దేవత
మారాముగ వచ్చె దరికి మాదరి కిచటన్
పారాణి పదపు మురిపా
లారని ముద్దుల జిలేబిలా సరిగమలా !
nice song..
థాంక్స్ ఫర్ ద కామెంట్ జిలేబి గారు, వనజ గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.