గురువారం, మే 19, 2016

తొలిసారి ముద్దివ్వమందీ...

నాకు రేడియో పరిచయం చేసిన పాటలలో ఇదీ ఒకటి. సత్యం గారి సంగీతం పంచే హాయే వేరు.. మీరే వినండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఎదురీత (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : వేటూరి
గానం : బాలు. పి.సుశీల

తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా
ఓ..ఓ..తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా.
 
పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా

నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం..
నీ పైటతీసి కప్పుకుంది ఆకాశం
తెరచాటు సొగసులారబోసి నాకోసం
నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే
నీ చూపులు సోకి... సొగసు వెల్లువలాయే
నీ ఊపిరి సోకి మనసు వేణువులూదే..

తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా

నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం
నీ మనసు విప్పి చెప్పమంది మధుమాసం
సిరిమల్లెపూలు గుప్పుమంది నీకోసం
నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే
నీ నవ్వులలోనే... వలపు గువ్వలు సాగే
నీ నడకలలోనే వయసు మువ్వలు మోగే

ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా

ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
ఈ రేయి హాయి మోయలేను ఒంటరిగా
ఇక రేపు మాపు తీపివలపు పంటలుగా
నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి
నులివెచ్చన కాదా.. మనసిచ్చిన రేయి
తొలిమచ్చికలోనే సగమిచ్చిన హాయీ

తొలిసారి ముద్దివ్వమందీ
చెలిబుగ్గ చేమంతి మొగ్గా

పెదవులలో మధువులనే కోరి కోరి చేరి
ఒకసారి రుచి చూడమందీ
చిరుకాటు ఈ తేనెటీగా

 

1 comments:పెదవుల మధువులు రుచియన
వదనము సొగసన సరసపు వరముగ మొగ్గా !
విధవిధ పదముగ మనసున
కదలిక సరసకు సమరస కవితగ వచ్చెన్ !

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.