గురువారం, మే 12, 2016

గోపెమ్మ చేతిలో గోరుముద్ద...

వంశీ ఇళయరాజాల కాంబినేషన్ లో వచ్చిన ఓ మధురమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : ప్రేమించు పెళ్లాడు (1985)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి

గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా

గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద..

రాగాలంత రాసలీలలు.. అలు అరు ఇణి
రాగాలైన రాధ గోలలు.. అలు అరు ఇణి
రాధా.. ఆఆఆఅ...
రాధా బాధితుణ్ణిలే.. ప్రేమారాధకుణ్ణిలే..
ఆహాహా...
జారు పైట లాగనేలరా..అహహ..
ఆరుబయట అల్లరేలరా..అహఅహ..
ముద్దు బేరమాడకుండా ముద్దలింక మింగవా 

గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ముద్దు కావాలా..ఊ.. ముద్ద కావాలా..ఆ..
ఆ విందా ఈ విందా నా ముద్దు గోవిందా

గోపెమ్మ చేతిలో గోరుముద్ద
రాధమ్మ చేతిలో వెన్నముద్ద..

వెలిగించాలి నవ్వు మువ్వలు.. అలా.. అలా.. అహహ
తినిపించాలి మల్లె బువ్వలు.. ఇలా.. ఇలా.. ఇలా
కాదా.. చూపే లేత శోభనం.. మాటే తీపి లాంఛనం..

ఆహాహా
వాలు జళ్ళ ఉచ్చులేసినా..అహ..ఆ
కౌగిలింత ఖైదు వేసినా..అహ..ఆ..
ముద్దు మాత్రమిచ్చుకుంటే ముద్దాయల్లె ఉండనా

గోపెమ్మ చేతిలో గోరుముద్ద ఊహూహు..
రాధమ్మ చేతిలో వెన్నముద్ద ఆహాహ..
ముద్దు కావాలి..ఊ.. ముద్ద కావాలి..ఆ..
ముద్దు కావాలి..ఊ.. ముద్ద కావాలి..ఆ..
ఆ విందు ఈ విందు నా ముద్దు గోవిందా

గోపెమ్మ చేతిలో అహ..
రాధమ్మ చేతిలో అహ..హ..


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.