శుక్రవారం, మే 06, 2016

సెంచరీలు కొట్టే...

ఆదిత్య 369 చిత్రం కోసం ఇళయరాజా గారు స్వరపరచిన ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి 

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
చాకిరీలనైనా మజా మజావళీలు చేసి
పాడు సోలో ఇంకా ఆడియోలో
వీడియోలో చెలి జోడియోలో

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ

మేఘమాలనంటుకున్న యాంటినాలతో
మెరుపుతీగ మీటి చూడు తందనాలతో

సందెపొద్దు వెన్నెలంటు చందనాలతో
వలపు వేణువూది చూడు వందనాలతో
చక్రవాక వర్షగీతి వసంత వేళ పాడు
తుళ్ళిపడ్డ ఈడుజోడు తుఫానులో

కన్నెపిల్ల వాలుచూపు కరెంటు షాకుతిన్న
కుర్రవాళ్ళ ఈలపాట హుషారులో
లైఫు వింత డ్యాన్సు లిఖించు కొత్త ట్యూన్సు
ఉన్నదొక్క ఛాన్సు సుఖించమంది సైన్సు
వాయువీణ హాయిగాన రాగమాలలల్లుకున్నవేళ

సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
చాకిరీలనైనా మజా మజావళీలు చేసి
పాడు సోలో ఇంకా ఆడియోలో
వీడియోలో చెలి జోడియోలో


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ

వెచ్చనైన ఈడుకున్న వేవులెంగ్తులో
రెచ్చి రాసుకున్నపాటకెన్ని పంక్తులో
విచ్చుకున్న పొద్దుపువ్వు ముద్దుతోటలో
కోకిలమ్మ పాటకెన్ని కొత్తగొంతులో

ఫాక్సుప్రాటు బీటు మీద పదాలు వేసి చూడు
హార్టుబీటు పంచుకున్న లిరిక్కులో
కూచిపూడి గజ్జెమీద ఖవాలి పాడి చూడు
కమ్ముకున్న కౌగిలింత కధక్కులో

నిన్నమొన్నకన్నా నిజానిజాలకన్నా
గతాగతాలకన్నా ఇవాళ నీది కన్నా
పాటలన్ని పూవులైన
తోటలాంటి లేత యవ్వనాన


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
చాకిరీలనైనా మజా మజావళీలు చేసి
పాడు సోలో ఇంకా ఆడియోలో
వీడియోలో చెలి జోడియోలో


సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ
సెంచరీలు కొట్టే వయస్సు మాదీ
బౌండరీలు దాటే మనస్సు మాదీ 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.