గురువారం, డిసెంబర్ 29, 2016

గోపాల కృష్ణుడమ్మా...

నాలో ఉన్న ప్రేమ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : నాలో ఉన్న ప్రేమ
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల (?)
గానం : బాలు, చిత్ర

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 
జయ కృష్ణ కృష్ణ హే గోవింద 
జయ కృష్ణ కృష్ణ హే గోవింద 
జయ కృష్ణ కృష్ణ హే గోవింద
జయ కృష్ణ కృష్ణ జయ కృష్ణ కృష్ణ

గోపాల కృష్ణుడమ్మా.. లోకాల కిష్టుడమ్మా 
అదిగదిగదిగో చూడమ్మా.. 
మన అలికిడి వినబడితే రాడమ్మా 

గోపాల కృష్ణుడమ్మా.. లోకాల కిష్టుడమ్మా 
అదిగదిగదిగో చూడమ్మా.. 
మన అలికిడి వినబడితే రాడమ్మా 

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 
జయ కృష్ణ కృష్ణ హే గోవింద 
జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

ఘల్లు ఘల్లుమంటు నల్లనయ్య 
మువ్వసడీ వింటే సరి.. 
అణువణువున విరియద నెమలి పురి. 
ప్రతీ వారి ఊపిరిలో పిల్లంగ్రోవి రాగాలూ
ప్రతీవారి చూపులో ఎన్నో వేల స్వప్నాలూ
రాసలీల ఆడే వేళలో

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 
జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

గోపాల కృష్ణుడమ్మా.. లోకాల కిష్టుడమ్మా 
అదిగదిగదిగో చూడమ్మా.. 
మన అలికిడి వినబడితే రాడమ్మా 

ఝల్లు ఝల్లు ఝల్లుమంటు 
కన్నె గుండె తుళ్ళిపడదా కనువిందుగా 
నల్లమబ్బు కిందికొచ్చి అందె కట్టి ఆడుతుండగా 
ప్రతి కన్నె గోపికలా ప్రతీ కన్ను దీపికలా 
ప్రతి తల్లి యశోదలా ప్రతీ ఇల్లు పూపొదలా 
మారిపోయి మురిసే వేళలో.. 

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 
జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

గోపాల కృష్ణుడమ్మా.. లోకాల కిష్టుడమ్మా 
అదిగదిగదిగో చూడమ్మా.. 
మన అలికిడి వినబడితే రాడమ్మా 

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.