ఈ రోజు నుండి ధనుర్మాసం మొదలవుతున్న సంధర్బంగా ఈనెల రోజులు అప్పట్లో కన్నయ్యను తలుచుకుంటూ వొచ్చిన పాటలు ఆస్వాదిద్దామా.. ముందుగా తులాభారం చిత్రంలోని ఒక చక్కని పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తులాభారం (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : రాజశ్రీ
గానం : సుశీల
రాధకు నీవేర ప్రాణం
ఈ రాధకు నీవేర ప్రాణం
రాధా హృదయం మాధవ నిలయం
రాధా హృదయం మాధవ నిలయం
ప్రేమకు దేవాలయం
ఈ రాధకు నీవేర ప్రాణం
ఈ రాధకు నీవేర ప్రాణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ శుభ చరణం..
నీ శుభ చరణం ఈ రాధకు శరణం
రాధకు నీవేర ప్రాణం
ఈ రాధకు నీవేర ప్రాణం
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
యమునా తీరం
యమునా తీరం రాగాల సారం
రాధకు నీవేర ప్రాణం
ఈ రాధకు నీవేర ప్రాణం
2 comments:
Beautiful song ! Thanks for sharing!
థాంక్స్ అజ్ఞాత గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.