బుధవారం, ఏప్రిల్ 23, 2014

చక్కిలిగింతల రాగం...

ఈ సినిమా విడుదలైన రోజుల్లో ఈ పాటమొదట్లో వచ్చే ఈల తెగ ప్రాక్టీస్ చేసేసి నేర్చేసుకున్న జ్ఞాపకం నేటికీ ఓ అపురూపం. పాటంతా సింపుల్ గా చాలా చలాకీగా అదే సమయంలో మెలోడీ ఎక్కడా మిస్ అవకుండా అలవోకగా స్టైల్ గా సాగిపోతుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. బాలు చిత్ర గార్లు ఇద్దరూ చాలా బాగా పాడారు. ఈ పాట వీడియో చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఈ క్రింది ఎంబెడెడ్ వీడియోలో (మూడవ పాట) కానీ లేదా ఇక్కడ కానీ వినవచ్చు.



చిత్రం : కొదమ సింహం (1990)
సంగీతం : రాజ్-కోటి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...
చెక్కిలిగుంటల గీతం...
 
ఓ ప్రియ యా యా యా యా....
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం
 
ఓ ప్రియ యా యా యా ....
సాయంత్ర వేళ.. సంపంగి బాల
శృంగార మాల... మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా
య యాయా...

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...
చుక్కలు చూడని ప్రాయం
ఓ ప్రియ యా యా యా యా....

కౌగిట్లో ఆకళ్ళు.. కవ్వించే పోకళ్ళు
మొత్తంగ కోరిందమ్మ మోజు...
పాలల్లో మీగడ్లు.. పరువాల ఎంగిళ్ళు ...
మెత్తంగ దోచాడమ్మ లౌజు....

వచ్చాక వయసు.. వద్దంటే ఓ యెస్సు..
గుచ్చెత్తి పిచ్చెక్కించే గుమ్మ సొగసు
ఊ.. అంటే తంట.. ఊపందుకుంటా...
నీ ఎండ కన్నేసి.. నా గుండె దున్నేసి
నీ ముద్దు నాటెయ్యాలీరోజు...

యా యా యా....
 
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే

చెక్కిలిగుంటల గీతం...
ఓ ప్రియ యా యా యా యా....

చూపుల్లో బాణాలు.. సుఖమైన గాయలు
కోరింది కోలాటాల ఈడు...

నీ ప్రేమ గానాలు.. లేలేత దానాలు
దక్కందే పోనే పోడు వీడు..
గిలిగింత గిచ్చుళ్ళు.. పులకింత పుట్టిల్లు
ముంగిట్లో ముగ్గేస్తుంటే.. నాకు మనసు

సయ్యంటేజంట.. చెయ్యందుకుంట...
బుడమేటి పొంగంటి.. బిడియాల బెట్టంతా
ఒడిలోనే దులిపేస్తాలే చూడు
య యాయ....

చక్కిలి గింతల రాగం..
ఓ ముద్దిస్తుంటే మురిపిస్తుంటే...
చెక్కిలిగుంటల గీతం...

ఓ ప్రియ యా యా యా యా....
ఎక్కడ దాచను అందం
నీ కన్నేస్తుంటే కాటేస్తుంటే
చుక్కలు చూడని ప్రాయం

ఓ ప్రియ యా యా యా ....
సాయంత్ర వేళ.. సంపంగి బాల
శృంగార మాల... మెళ్ళోన వేసి ఒళ్ళోన చెరగా
య..యా..య... 

 

2 comments:

ఈ పాటెప్పుడు విన్నా, చల్లగాలిలో గోదారి గట్టున కూర్చుని మిర్చిబజ్జి తింటున్నట్టుంటుంది..కాక పోతే ప్రస్తుత పరిస్థితుల్లో చిరుని పాటల్లో కూదా చూడ బుద్ధి కావట్లేదు కాబట్టి ఓన్లీ ఆడియోని మాత్రమే యెంజాయ్ చేస్తున్నాము..

థాంక్స్ శాంతి గారు, ఫీల్ గురించి ఎంతబాగా చెప్పారో చిరంజీవి ప్రస్తుత పరిస్థితి గురించి కూడా అంతే బాగా చెప్పారండీ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.