మంగళవారం, ఏప్రిల్ 08, 2014

రాముని అవతారం...

భూకైలాస్ సినిమాలో రామాయాణాన్నంతటిని ఒక్క పాటలో గానం చేసిన ఈ పాట అద్భుతంగా ఉంటుంది ఘంటసాల గారి స్వరంలో పాట వింటూ మైమరచిపోతామనుకుంటే చిత్రీకరణ సైతం పరమాద్బుతంగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

ఈ రోజు రామనవమి సంధర్బంగా మిత్రులందరకూ హృదయపూర్వక శుభాకాంక్షలు.. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం మీ పై సదా ఉండాలని కోరుకుంటున్నాను. రామనవమికి వేసే పందిళ్ళు గుర్తున్నాయా... ఒకప్పటంత కాకపోయినా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి కదా. వాటిని గుర్తుచేసుకుంటూ ఈరోజునుండి తొమ్మిది రోజుల పాటు ఈ బ్లాగ్ లో రాముని పాటలు తలచుకుందాం.చిత్రం :  భూకైలాస్ (1958)
సంగీతం : ఆర్. సుదర్శన్, ఆర్. గోవర్ధన్
సాహిత్యం :  సముద్రాల (సీనియర్)
గానం :  ఘంటసాల

ద్వారపాలుర మరల దరిదీయు కృపయో...
ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో...ఓ...
రాముని అవతారం... రవికులసోముని అవతారం....

రాముని అవతారం... రవికులసోముని అవతారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం

సుజనజనావన ధర్మాకారం.. .దుర్జనహృదయవిదారం ...
రాముని అవతారం

దాశరథిగ శ్రీకాంతుడు వెలయూ...కౌసల్యాసతి తపము ఫలించూ
జన్మింతురు సహజాతులు మువ్వురు...
జన్మింతురు సహజాతులు మువ్వురు...లక్ష్మణ.. శత్రుఘ్న.. భరతా
 
రాముని అవతారం ...రవికులసోముని అవతారం
చదువులునేరుచు మిషచేత... చాపముదాలిచి చేతా
విశ్వామిత్రుని వెనువెంట ... యాగముకావగ చనునంట
అంతము చేయునహల్యకు శాపము

అంతము చేయునహల్యకు శాపము
వొసగును సుందర రూపం ...

రాముని అవతారం...రవికులసోముని అవతారం

  
ధనువో జనకుని మనసున భయమో
ధారుణి కన్యాసంశయమో
దనుజులు కలగను సుఖగోపురమో...
దనుజులు కలగను సుఖగోపురమో...

విరిగెను మిథిలానగరమునా
 
రాముని అవతారం రవికులసోముని అవతారం
 
కపట నాటకుని పట్టాభిషేకం... కలుగును తాత్కాలిక శోకం
భీకర కానన వాసారంభం... లోకోద్ధరణకు ప్రారంభం
భరతుని కోరికతీరుచుకోసం... పాదుకలొసగే ప్రేమావేశం
భరతుని కోరికతీరుచుకోసం... పాదుకలొసగే ప్రేమావేశం
నరజాతికి నవ నవసంతోషం... గురుజనసేవకు ఆదేశం
 
రాముని అవతారం రవికులసోముని అవతారం

అదిగో చూడుము బంగరు జింకా... 

అదిగో చూడుము బంగరు జింకా...
మన్నైకనునయ్యో లంకా... 

హరనయనాగ్ని పరాంగన వంకా...
అరిగిన మరణమె నీకింకా...

రమ్ము రమ్ము హే భాగవతోత్తమ... వానరకుల పుంగవ హనుమా
రమ్ము రమ్ము హే భాగవతోత్తమ... వానరకుల పుంగవ హనుమా
ముద్రిక కాదిది భువన నిదానం... ముద్రిక కాదిది భువన నిదానం..
జీవన్ముక్తికి సోపానం... జీవన్ముక్తికి సోపానం

రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకులశోమా...
సీతాశోక వినాశనకారి... లంకావైభవ సంహారి
అయ్యో రావణ భక్తాగ్రేసర అమరంబౌనిక నీ చరిత...
సమయును పరసతిపై మమకారం...వెలయును ధర్మవిచారం
 
రాముని అవతారం... రవికులసోముని అవతారం
రాముని అవతారం... రవికులసోముని అవతారం 

 

3 comments:

జానక్యా కమలాంజలి పుఠేయః
పద్మరాగయితాః నస్త్యారాఘవ మస్తకేచ విలస్కుంద
ప్రసూనాయితః స్రస్త్య శ్యామలకాయ కాంతి కలితాః యా
ఇంద్రనీలాయితాః ముక్తాస్త శుభదాం భవంతు భవతాం శ్రీ
రామ వైవాహికః ...
*శ్రీ రామ నవమి శుభాకాంక్షలు వేణూజీ!!

థాంక్స్ శాంతి గారు, మీకు కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

థాంక్స్ దుర్గేశ్వర గారు జై శ్రీరామ్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.