మంగళవారం, ఏప్రిల్ 15, 2014

శ్రీ రామ నామాలు...

హనుమజ్జయంతి శుభాకాంక్షలు..
రమేష్ నాయుడి గారి సంగీత సారధ్యంలో సుశీలమ్మ గానం చేసిన ఈ "శ్రీరామ నామాలు" పాట సాంఘీక చిత్రం కోసం తీసినదైనా చిత్రీకరణ మధ్యలో కాస్తంత విసిగించినా వినడానికి మాత్రం ఒక దివ్యమైన పాట, నాకు చాలా ఇష్టమైన పాట మీరూ ఆస్వాదించండి. ఎంబెడ్ చేసిన వీడియో ఫోటోలతో చేసిన ప్రజంటేషన్ (మొదటిసారి మూవీమేకర్ నేర్చుకుని మరీ ఈ వీడియో చేసిచ్చిన ఓ ఫ్రెండ్ కు మెనీ థాంక్స్). ఈ పాట సినిమాలోని చిత్రీకరణ ఎలాఉందో చూడాలంటే వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే చిమటలో ఇక్కడ లేదా రాగా లో ఇక్కడ వినవచ్చు. మిత్రులందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు.చిత్రం : మీనా (1973)
సంగీతం : రమేష్ నాయుడు
రచన : ఆరుద్ర
గానం : పి.సుశీల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..
శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు
దశరధరామయ్య స్థవనీయుడు..
తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు
దశరధరామయ్య స్థవనీయుడు..
కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు
కళ్యాణరామయ్య కమనీయుడు..కమనీయుడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి
సుందర రామయ్య సుకుమారుడు..
సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి
సుందర రామయ్య సుకుమారుడు
కోతిమూకలతో.. ఆ ఆ ఆ
కోతిమూకలతో లంక పై దండెత్తు
కోదండరామయ్య రణధీరుడు..రణధీరుడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి..

పవమానసుతుడు పాదాలు పట్టగా
పట్టాభిరామయ్య పరంధాముడు..
పవమానసుతుడు పాదాలు పట్టగా
పట్టాభిరామయ్య పరంధాముడు
అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు
అచ్యుతరామయ్య అఖిలాత్ముడు..అఖిలాత్ముడు

శ్రీరామ నామాలు శతకోటి..
ఒక్కొక్క పేరు బహుతీపి..బహుతీపి
శ్రీరామ నామాలు శతకోటి.. 
 

4 comments:


మూడే చరణల్లో, రామాయణ సారాన్నంతా అందిందిచిన ఆరుద్ర గారికి హేట్సాఫ్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.