మంగళవారం, ఏప్రిల్ 29, 2014

నాగమల్లివో తీగ మల్లివో...

రాజన్ నాగేంద్ర గారి సంగీతంలో ఒక మధురమైన పాట. చిన్నపుడు రేడియోలో చాలా ఎక్కువగా విన్నపాట... అలా గుర్తుండిపోయింది. ఈ పాటలో నాగమల్లివో.. తీగమల్లివో.. అని ఒక్కో పదానికి బ్రేక్ వచ్చినపుడు వచ్చే ఒక చిన్న మ్యూజిక్ బిట్ తో సహా పాడేసుకునే వాణ్ణి చిన్నప్పుడు. సున్నితంగా అలా సాగిపోయే ఈ పాట నాకు చాలా ఇష్టం మీరూ విని ఆస్వాదించండి. వీడియో లింక్ దొరకలేదు మీకు తెలిస్తే కామెంట్స్ లో పంచుకోండి.   చిత్రం : నాగమల్లి (1980)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి
నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి
నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి

వీణల్లే పాడు జాణల్లే ఆడు
రసధునివై నీవు నాలోనా
ఊగాలీ రాగ డోలా
నీలో నాదాలు ఎన్నో విన్నాను
పరువపు వేణువులీవెళా
నువ్వేనా రాసలీల
నేను వేణువై నిను వరింపగా
అలిగిన అందెల సందడిలో

నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
రాకతో జీవనం రాగమై పలుకగా
ఏదీ ఇంకొక సారి ముద్దుల మోహన మురళి
నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి

నువ్వే నా ఈడు నవ్వే నా తోడు
కలిసిన కాపుర మీవేళ
కావాలి నవ్య హేల
నీలో అందాలు ఎన్నో గ్రంధాలు
చదివిన వాడను ఈ వేళా
నువ్వే నా కావ్య మాలా
పువ్వు పువ్వున పులకరింతలే
విరిసెను మన చిరు నవ్వులలో

నాగమల్లివో తీగ మల్లివో నీవే రాజకుమారి
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
ఓ... నవ్వులో యవ్వనం పువ్వులై విరియగా
ఏదీ ఇంకొక సారి నవ్వవే చంద్ర చకోరీ
నాగ మల్లినో తీగ మల్లినో నీదే రాజకుమారి
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ...
నీవే రాజకుమారీ... నీదే రాజకుమారీ... 
 

8 comments:

Thanks for posting this song
This movie was a disaster directed by Devdas kankala
But..
Beautiful songs and great music.
It'd have been a great movie and a musical master piece in some other director.s hands.
I had these songs with me for many many years
Thanks again.

Signature of rajan nagendra. You can't miss

Amazing song. First time I watched this song on some 24 hours music channel when I was in India and became a big fan for it. Later I searched a lot online for the song and movie videos but all my efforts went in vain.

$

ధన్యవాదాలు అజ్ఞాత గారు .. సినిమా ఫ్లాప్ కనుకే అనుకుంటానండీ ఎక్కడా దొరకడంలేదు.

థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు..

థాంక్స్ సిద్ గారు.. నేనూ చాలా వెతికానండీ పాట వీడియో కోసం ఎక్కడా దొరకలేదు.

చిన్నప్పుడు అంత్యాక్షరి ఆడుతూ 'న" అక్షరం వస్తే చాలు .. అందరూ కలిసి వూగుతూ ఈ పాట పాడే వాళ్ళం వేణూజి..

హహహ బాగుందండీ మీ జ్ఞాపకం, థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

పాట డౌన్ లోడ్ లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఈ పాట నాకు ఎంతో ఇష్టం.

థాంక్స్ సీతారాం గారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.