గురువారం, ఏప్రిల్ 03, 2014

శ్రీ తుంబుర నారద...

బాలకృష్ణ చేసిన సినిమాలలో ఫాన్స్ యాంటీ ఫాన్స్ అని వ్యత్యాసం లేకుండా అందరూ ఏకగ్రీవంగా మెచ్చుకున్న అతి కొద్ది చిత్రాలలో బైరవద్వీపం ఒకటి. ఇందులోని ఈ పాట ఎన్టీఆర్ గారు నటించగా ఘంటసాల గారు గానం చేసిన శివశంకరి అంత కాకపోయినా సంగీతపరంగా ఆకట్టుకునే చక్కని పాట. మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలనుకుంటే ఇక్కడ వినవచ్చు.చిత్రం : భైరవద్వీపం (1994)
సంగీతం : మాధవపెద్ది సురేష్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

శ్రీ తుంబుర నారద నాదామృతం
ఆఆఆ.. శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వర రాగ రస భావ తాళాన్వితం ..
సంగీతామృత పానం ఇది స్వరసుర జగతీ సోపానం
శివుని రూపాలు భువికి దీపాలు.
స్వరం పదం ఇహం పరం కలిసిన
శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం

సప్త వర్ణముల మాత్రుకగా
శుక్త వర్ణముల డోలికగా
సప్త వర్ణముల మాత్రుకగా
శుక్త వర్ణముల డోలికగా
ఏడు రంగులే తురగములై
శ్వేతవర్ణ రవి కిరణములై
స ప స  గ రి గ ని ద ప మ గ
గ ని గ మ గ రి స ని స
సగమ గమప మపని స
గరిసనిద రిసనిదప సనిదపమ

శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం

స స స స స
సనిప గరిస గ ప ని స గరిస ..
నిసరి పనిస గపని రిగప గరిస
సంగీతారంభ సరస హేరంబ 
స్వర పూజలలో షడ్జమమే .
రి రి రిమపనిదమ మపనిసగరి మగరిసనిస రిమాగారిస నిసరినిదమప
మగరి నిదప మగరి
శంభోకైలాస శైలూషికా నాట్య నందిత స్వరనంది రిషభమే
గగా గారిసరి సద సాదప గగపదస
మురళి వనాంతాల విరియు వసంతాల
మురళి వనాంతాల విరియు వసంతాల 
చిగురించు మోహన గాంధారమే
మా సమగస నిదమ సమగ మదని మదనిగస
మోక్షలక్ష్మీ దేవి గోపుర శిఖరాన కలశము హిందోళ మద్యమమే
పా పమప దదప పమప దనిద పదస పాదసరి పమరిస నిదపమప రిసరిమప
సరస్వతి రాగాల కుహుకుహు గీతాలు పలికిన కోయిల పంచమమే
దా దనిసమగరి పదనిరి సనిదప రిసనిదప మగరిగమప
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన ఆ...
వాన జల్లుల వేళ ఆ చక్రవాకాన
హర్షాతి రేఖాలు దైవతమే
నీ సనిదప మగరిస నిరినిరినిరీరి నీరిగామ పమగరి 
మదమదాద మాదనిరి గరిసా
కళ్యాణి సీతమ్మ కళ్యాణ రామయ్య 
కథ పదముగ పాడె నిషాదమే

తద్దిన్న తిద్దిన్న దిద్దిన్న కిటదిన్న
తద్దిన్న తిద్దిన్న దిద్దిన్న కిటదిన్న
నినిపమ గమపని మపనినిసా......
నినిసససస నినిరిరిరిరి నినిగగగమ రిగసరినిస
పనిస మపని గమప సగమ సమగపమని పసనిరిసగ
మగమగరి గరిగరిస రిసరిసని సనిసనిద నిదనిదప దపదపమ
సగమప గమపని మపనిస గసగా గమపా గసగా మగమా
సగమప మగరిస నిదపమ గమపని దపమగరిస
నినిని సాససస నినిని గాగగగ నినినిమమగమ పమగరిసా
గగగగాపపగ గగగనినినిని గగగసాసనిస గరిసమ గరిసా
నిసనిసనిసనిస పనిపనిపనిమప
నిసనిసనిసనిస పనిపనిపనిమప
గమగమగమగమ సగసగసగనిస
గమగమగమగమ సగసగసగనిస
నిసగమ సగమప గమపని మపనిసస
సగమప గమపని మపనిస పనిసగ
సాసససస రిరిరిరిరి సాసససస గగగగగ 
రిరిరిరిరి గగగగగ రిరిరిరిరి మమమమమ
గమ గమ గమ గమ గమ గస గమ పా
శ్రీ తుంబుర నారద నాదామృతం
స్వరరాగ రసభావ తాళాన్వితం


Lyrics collected with thanks from This link with minor corrections.

3 comments:

Thank you..thank you so much thanq.. Srikanth gaaru:):)

విత్ డ్యూ రెస్పెక్ట్స్ టూ బాలూ గారు..ఈ పాట వింటే, ఘంటసాల గారి 'శివశంకరీ"..ఆటోమేటిక్ గా గుర్తొచ్చేస్తుంది వేణుజీ..వీలైతే ప్రెజెంట్ చేయ గలరా..

ప్లెజర్ ఈజ్ మైన్ కార్తీక్ గారు :-)

థాంక్స్ శాంతి గారు, తప్పకుండా పోస్ట్ చేస్తాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.