శుక్రవారం, ఏప్రిల్ 04, 2014

పచ్చని చిలుకలు తోడుంటే..

పాటల రచయితల గురించి అపుడపుడే తెలుసుకుంటున్న సమయంలో భువనచంద్ర గారు ఇంత చక్కని పాటలు రాయగలరా అని నన్ను ఆశ్చర్య పరచిన పాట ఇది. డబ్బింగ్ పాట కనుక అక్కడక్కడ కొంచెం పదాలను మ్యానేజ్ చేసినట్లు కనిపించినా ఓవరాల్ గా చాలా అందమైన పాట. జేసుదాస్ గారి గాత్రం శంకర్ చిత్రీకరణ తోడయ్యేసరికి చూస్తూ మైమరచిపోయేలా చేస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఈపాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రం వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : భారతీయుడు (1996) 
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్ 
సాహిత్యం : భువనచంద్ర 
గానం : కె.జె.ఏసుదాస్

తందానానే తానానే ఆనందమే తందానానే తానానే ఆనందమే
తందానానే తానానే ఆనందమే  తందానానే తానానే ఆనందమే

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు 

చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట
 
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

అందని మిన్నే ఆనందం అందే మన్నే ఆనందం
అరె భూమిని చీల్చుకు పుట్టే పచ్చని పసిరిక ఆనందం
మంచుకి ఎండే ఆనందం వాగుకి వానే ఆనందం
అరె ఎండకి వానకి రంగులు మారే ప్రకృతి ఆనందం
బ్రతుకే నూరేళ్ళందం బ్రతుకే బ్రహ్మానందం చెలియా
వయసుడిగే స్వగతంలో అనుబంధం ఆనందమానందం  

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

నీ శ్వాసను నేనైతే నా వయసే ఆనందం
మరుజన్మకు నన్నే కన్నావంటే ఇంకా ఆనందం
చలి గుప్పే మాసంలో చెలి ఒళ్ళే ఆనందం
నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే కరుణే ఆనందం
అందం ఓ ఆనందం బంధం పరమానందం
చెలియా ఇతరులకై కను జారే కన్నీరే ఆనందమానందం 

పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు 

చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే
అరె చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే
సీతాకోక చిలుకకు చీరలెందుకు
అరె ప్రేమ ఉంటే చాలునంట డబ్బు గిబ్బులెందుకంట  
 
పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే
భూలోకమే ఆనందానికి ఇల్లు ఈ లోకంలో కన్నీరింక చెల్లు

7 comments:

సూపర్ సాంగ్! మా అన్నయ్యకి మహా ఇష్టం. అందుకని మాక్కూడా...:)
"నా చెవులను మూస్తూ దుప్పటి కప్పే 'తరుణే' ఆనందం.." అని పాడేవాళ్ళం మేము. "ఎవరైనా చెవులను మూస్తూ దుప్పటి కప్పుతారా?" అనడిగేవారు నాన్న తను పడుకునేప్పుడు :-)

సూపర్ సాంగ్ అసలు. అందులోనూ యేషుదాస్ గారి గొంతు చెవుల్లో అమ్రుతం పోసినంత హాయిగా అలా మనసుపొరల్లోకి ఒదిగిపోతుంది. ఇంకోసారి గుర్తుచేసినందుకు ధన్యవాదాలు

పూరేకుల్లో, సీతాకోక చిలుక రెక్కల్లో వుండే కలర్ కాంబినేషన్స్ చూసినప్పుడల్లా, భగవంతుణ్ణి మించిన ఆర్టిస్ట్ యెవరూ లేరనిపిస్తుంది..అందుకే ఈ పాటలో 'సీతాకోక చిలుకకు చీరలెందుకు" అన్న వాక్యం చాలా ఇష్టం నాకు..

థాంక్స్ తృష్ణ గారు హహహ ఈ పాటతో మీ జ్ఞాపకాలు బాగున్నాయండీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు :-)

థాంక్స్ లక్ష్మి గారు. ఏసుదాస్ గారి గళం అమృతమేనండీ నిస్సందేహంగా.

థాంక్స్ శాంతి గారు, నిజమేనండి ప్రకృతిలో వర్ణాలు, సృష్టిలోని కాంప్లెక్సిటీ, వైవిధ్యతత చూసినపుడు భగవంతుడి గురించి అలానే అనిపిస్తుంది.

మంచి పాట.
నాదో మనవి. నాకిష్టమైన ఈ కాంబినేషన్‌లోని పాటలు పరిచయం చెయ్యగలరా?
జేసుదాస్, జానకి కలిసి మహదేవన్ లేదా ఇళయరాజా సంగీత సారధ్యంలో పాడిన పాటలు.

Meeku snehaani kanna minna lokaana leduraa paata telusanukuntaa, idi Bhuvanachandra raasaaru

థాంక్స్ బోనగిరి గారు.. తప్పక పరిచయం చేయడానికి ప్రయత్నిస్తాను.

థాంక్స్ చారి గారు హా ఆపాట గురించి తెలుసండీ. నేను చెప్పినది పాటలు వినడమే తప్ప టెక్నీషియన్స్ గురించి బొత్తిగా తెలుసుకోని సమయంలోనండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.