మనసే మందిరం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : మనసే మందిరం (1966)
సంగీతం : ఎం. ఎస్. విశ్వనాధన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : పి.సుశీల
అల్లారు ముద్దుకదే
అపరంజి ముద్దకదే
తీయని విరితోట కదే
దివి ఇచ్చిన వరము కదే
అల్లారు ముద్దుకదే
అపరంజి ముద్దకదే
తీయని విరితోట కదే
దివి ఇచ్చిన వరము కదే
అల్లారు ముద్దుకదే
చిరు చిరు మువ్వలతో చిందాడే నడక కదే
చిన్నారి మొహములోన సిరులొలికే నగవు కదే
చిన్నారి మొహములోన సిరులొలికే నగవు కదే
చినికిన తేనెవి తొలకరి వానవి
చినికిన తేనెవి తొలకరి వానవి
చిదిమిన మెరుపు కదే
చెంగల్వ మెరుగు కదే
అల్లారు ముద్దుకదే
అపరంజి ముద్దకదే
తీయని విరితోట కదే
దివి ఇచ్చిన వరము కదే
అల్లారు ముద్దుకదే
పదినెలలు హృదయంలో పండినట్టి తపసు కదే
పలుకని దైవాన్నీ పలికించే తల్లి కదే
పలుకని దైవాన్నీ పలికించే తల్లి కదే
ఇంటికి వెలుగుకదే
కంటికి కలవు కదే
ఒంటరి బ్రతుకైనా
ఓపగలుగు తీపికదే
అల్లారు ముద్దుకదే
అపరంజి ముద్దకదే
తీయని విరితోట కదే
దివి ఇచ్చిన వరము కదే
అల్లారు ముద్దుకదే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.