ఆదివారం, మే 07, 2017

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట...

గంగోత్రి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : గంగోత్రి (2003)
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : చంద్రబోస్
గానం : కౌసల్య, ఐశ్వర్య

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట
మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా
తోడుండి పొమ్మంటా
తను నవ్విందంటే ఇంకేం కావాలి
నిదరోతూ ఉంటే తన పక్కనుండాలి
ఈ బంగరు పాపను కంటికి రెప్పగ కాచుకోవాలి
వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట
మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా
తోడుండి పొమ్మంటా

గరిసనిసమగరిస గరిసనిసమగరిస
సగమనినిపమగమ సగమనినిపమగమ
పపమగ మమగస గగసనిస 
పపమగ మమగస గగసనిస 
 
చిరు చిరు మాటలు పలికేవేళ చిలక దిష్టి
బుడి బుడి అడుగులు వేసేవేళ హంస దిష్టి
వెన్నెలమ్మలా నవ్వే వేళ జాబిలి దిష్టి
జాబిలమ్మలా ఎదిగే వేళ దిష్టి చుక్క దిష్టి
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి దేవుని దిష్టి
ఏ దిష్టి తనకు తగలకుండా నువ్వే చూడాలి

వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట
మెల్లగ రమ్మంటా
చిన్నారి పాపా పొన్నారి పాపా
తోడుండి పొమ్మంటా

ఆటలాడగా చిట్టి చేతిలో బొమ్మనవుతా
ఆకలేయగా బుల్లి బొజ్జలో బువ్వనవుతా
స్నానమాడే చల్లని వేళ వేన్నీళ్ళవుతా
ఎక్కెక్కీ ఎడ్చే వేళ కన్నీళ్ళవుతా
నేస్తాన్నవుతా గురువు అవుతా
పనిమనిషి తన మనిషవుతా
నే చెప్పే ప్రతి మాటకు నువ్వే సాక్ష్యం అవ్వాలీ

వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా
మెల్లగ రమ్మంటా
మా మంచి పాట సింహాద్రి పాట
మనసార వినమంటా
తన తియ్యని పాటే అమ్మ పాడే లాలి
తన తోడే ఉంటే అది దీపావళి
మా ఇద్దరి స్నేహం వర్ధిల్లాలని దీవెనలివ్వాలి
వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా
మెల్లగ రమ్మంటా
మా మంచి పాట సింహాద్రి పాట
మనసార వినమంటా
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.