బుధవారం, మే 17, 2017

తెలి మంచు కరిగింది...

స్వాతికిరణం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : వాణీజయరాం

తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ
తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ

నీ దోవ పొడవునా.. కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి.. మెలకువల వందనము
తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ

ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భాను మూర్తీ.. నీ ప్రాణకీర్తన విని.. 
పలుకనీ ప్రణతులనీ ప్రణవ శృతినీ.. 
పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతిని

తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ

భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలో.. పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు..
తాలయూర్చు.. తలిరాకు బహుపరాకులు విని..
దొరలనీ దోర నగవు దొంతరనీ
తరలనీ దారి తొలగి రాతిరిని

తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ

నీ దోవ పొడవునా.. కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి.. మెలకువల వందనము
తెలి మంచు కరిగింది..  తలుపు తీయనా ప్రభూ 


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.