జీవన తరంగాలు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : జీవనతరంగాలు (1973)
సంగీతం : జె.వి. రాఘవులు
సాహిత్యం : సినారె
గానం : ఘంటసాల
ఉడతా ఉడతా హూత్.. ఎక్కడికెళతావ్ హూత్
కొమ్మ మీది జంపండు కోసుకొస్తావా.. మా బేబీకిస్తావా ?
ఉడతా ఉడతా హూత్.. ఎక్కడికెళతావ్ హూత్
కొమ్మ మీది జంపండు కోసుకొస్తావా.. మా బేబీకిస్తావా ?
చిలకమ్మా.. ఓ చిలకమ్మా.. చెప్పేది కాస్తా వినవమ్మా
చిలకమ్మా.. ఓ చిలకమ్మా.. చెప్పేది కాస్తా వినవమ్మా
నీ పంచదార పలుకులన్నీ.. బేబీకిస్తావా.. మా బేబీకిస్తావా?
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
ఉరకలేసే ఓ జింకా.. పరుగులాపవె నీవింకా
ఉరకలేసే ఓ జింకా.. పరుగులాపవె నీవింకా
నువు నేర్చుకున్న పరుగులన్నీ..
నువు నేర్చుకున్న పరుగులన్నీ..
బేబీకిస్తావా.. మా బేబీకిస్తావా ?
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
చిలకల్లారా.. కోకిలలారా... ఛెంగున దూకే జింకల్లారా
చిలకల్లారా.. కోకిలలారా... ఛెంగున దూకే జింకల్లారా
చిన్నారి పాపల ముందు.. మా చిన్నారి పాపలముందు
మీరెంత? మీ జోరేంత?.. మీరెంత? మీ జోరేంత?
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
ఉడతా ఉడతా హూత్... ఎక్కడికెళతావ్ హూత్
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.