మంగళవారం, మే 30, 2017

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...

జీవన జ్యోతి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జీవన జ్యోతి (1975)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : దాశరథి
గానం : పి.సుశీల

ష్.. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...ష్..
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..
ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు...
మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు...
జుజుజుజుజు.. జుజుజుజుజు..

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..

చల్లగా నిదరోయే బాబు..
నిదురలో మెల్లగ నవ్వుకునే బాబు..
చల్లగా నిదరోయే బాబు..
నిదురలో మెల్లగ నవ్వుకునే బాబు..
ఏమి కలలు కంటున్నాడొ తెలుసా... తెలుసా...
ఏ జన్మకు ఈ తల్లే కావాలనీ...
ఈ ఒడిలోనె ఆదమరచి వుండాలనీ...
జుజుజుజుజు.. జుజుజుజుజు...

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..

దేవుడే నా ఎదురుగ నిలబడితే...
ఏమి కావాలి తల్లీ..అని అడిగితే...
దేవుడే నా ఎదురుగ నిలబడితే...
ఏమి కావాలి తల్లీ..అని అడిగితే...
నేనేమని అంటానో తెలుసా...తెలుసా...
నీ నీడలో నా వాడు పెరగాలనీ...
నీ నీడలో నా వాడు పెరగాలనీ...
పెరిగి నీలాగే పేరు తెచ్చుకోవాలని...
జుజుజుజుజు.. జుజుజుజుజు...

ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు...
సద్దు చేసారంటె వులికులికి పడతాడు..
గోపాల కృష్ణయ్య రేపల్లెకు వెలుగు...
మా చిన్ని కన్నయ్య లోకానికె వెలుగు...
జుజుజుజుజు.. జుజుజుజుజు..


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.