శనివారం, మే 06, 2017

తియ తీయని తేనెల మాటలతో...

ఖైదీ కన్నయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఖైదీకన్నయ్య (1962)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : ఆత్రేయ
గానం : సుశీల

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు
తెలియని చీకటి తొలగించి
వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు

దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
పదుగిరిలోన పరువును పెంచి
పేరు తెచ్చే పెన్నిధది

పాఠాలన్నీ చదివేస్తాను
ఫస్టుగ నేను పాసవుతాను..
శభాష్

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు

అల్లరి చేయుట చెల్లనిది
ఎల్లకు వాడుక కూడనిది
ఏడువరాదు ఏమనరాదు
ధీరునివలెనే నిలవాలి

అదరను నేను బెదరను నేను
ఏదెదురైనా ఎదిరిస్తాన్.. శభాష్

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు

బ్రతుకును బాటను కడదాకా
నడచియె తోవలె ఒంటరిగా
బ్రతుకును బాటను కడదాకా
నడచియె తోవలె ఒంటరిగా
ఉరుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులువలె తడబడునా

పిడుగులు పడినా జడవను నేను
వడివడిగా అడుగేస్తాన్.. శభాష్

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.