మంగళవారం, మే 23, 2017

మానవుడే మహనీయుడు...

బాలభారతం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాల భారతం (1972)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల

మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు
మానవుడే మాననీయుడు
మానవుడే... మహనీయుడు

మంచిని తలపెట్టినచో మనిషికడ్డు లేదులే...
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే...
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు

దివిజ గంగ భువిదించిన భగీరథుడు... మానవుడే ...
సుస్ధిర తారగ మారిన ధ్రువుడు కూడ... మానవుడే...
సృష్టికి ప్రతిసృష్టి చేయు విశ్వామిత్రుడు... నరుడే...
జీవకోటి సర్వములో శ్రేష్ఠతముడు... మానవుడే...

మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు

గ్రహరాశులనధిగమించి ఘనతారల పథమునుంచి
గ్రహరాశులనధిగమించి ఘనతారల పథమునుంచి
గగనాంతర రోదసిలో.. ఓ.. గంధర్వగోళకతుల దాటి

చంద్రలోకమైన... దేవేంద్రలోకమైన
చంద్రలోకమైన... దేవేంద్రలోకమైన
బొందితో జయించి మరల భువికి తిరిగిరాగలిగే

మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు
మానవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.