సోమవారం, మే 22, 2017

ముద్దు ముద్దు నవ్వు...

పి.బి.శ్రీనివాస్ గారు గానం చేసిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సత్తెకాలపు సత్తెయ్య (1969)
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : పి.బి. శ్రీనివాస్

ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ
ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

ఏ ఇంటి పంటవో ఏ తల్లి నోమువో
ఏ ఇంటి పంటవో..ఏ తల్లి నోమువో
ఈ ఒంటి వానికీ..నా వంటి పేదకూ
ఏ ఇంటి పంటవో..ఏ తల్లి నోమువో
ఈ ఒంటి వానికీ..నా వంటి పేదకూ
ప్రాణాలు పోసావు..బతకాలి అన్నావు
ఉరితాడు జో జోల ఉయ్యాల చేసావు
ఉయ్యాల చేసావు..

ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ
బజ్జోమ్మ నువ్వూ

నా బాధ విన్నావు..నీ గాధ చెప్పావు
ఈ పూరి గుడిసెలో..నా బీడు మనసులో
నా బాధ విన్నావు..నీ గాధ చెప్పావు
ఈ పూరి గుడిసెలో..నా బీడు మనసులో
చిన్నారి పొన్నారి..చిగురల్లె వెలిసావు
సిరిలేదు గిరిలేదు..మనసుంటే అన్నావు..
మనసుంటే అన్నావు..

ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ
బజ్జోమ్మ నువ్వూ

ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ
జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ
బజ్జోమ్మ నువ్వూ..బజ్జోమ్మ నువ్వూ
బజ్జోమ్మ నువ్వూ..బజ్జోమ్మ నువ్వూ


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.