బుధవారం, మే 31, 2017

ఆనతి నీయరా.. హరా...

స్వాతికిరణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : వాణీజయరాం

ఆ.... ఆ... ఆ.... ఆ.....

ఆనతి నీయరా.. హరా
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా.. దొరా...
సన్నిధి చేరగా... ఆనతి నీయరా.. హరా
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...
సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా...

నీ ఆన లేనిదే రచింపజాలునా
వేదాలవాణితో విరించి విశ్వనాటకం
నీ సైగ కానిదే జగాన సాగునా
ఆ యోగమాయతో మురారి దివ్యపాలనమ్

వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
వసుమతిలో ప్రతి క్షణం.. పశుపతి నీ అధీనమై
కదులునుగా సదా సదాశివ
ఆనతి నీయరా.. హరా

ని ని స ని ప నీ ప మ గ స గ... ఆనతి నీయరా!
అచలనాధ అర్చింతునురా... ఆనతినీయరా!

పమ పని పమ పని పమ పని గమ పని
సని సగ సని సగ సని సగ పని సగ
గమగసా నిపమ గమగస సగసని... ఆనతినీయరా!
జంగమ దేవర సేవలు గొనరా...
మంగళ దాయక దీవెనలిడరా!
సాష్ఠాంగముగ దండము సేతురా... ఆనతినీయరా!

సానిప గమపానిపమ
గమగ పాప పప
మపని పాప పప
గగమ గాస సస
నిసగ సాస సస
సగ గస గప పమ పస నిస
గసని సాగ సాగ
సని సాగ సాగ
సగ గాస సాస
సని సాగ గ
గసగ గా
పద గస గా స ని పమగమ గా...
ఆనతినీయరా!

శంకరా...  శంకించకురా!
వంక జాబిలిని జడను ముడుచుకొని...
విసపు నాగులను చంకనెత్తుకొని...
నిలకడనెరుగని గంగనేలి...
ఏ వంకలేని నా వంకనొక్క
కడగంటి చూపు పడనీయవేమి..
నీ కరుణిక సేవించుకొందురా!
ఆనతినీయరా...

పప పమప నినిపమగస గగ
పప పమప నినిపమగస గగ
గమపని గా మపనిస మా పనిసగ
నీ స పా ని మా ప గా మ సా గామ
పప పమప నినిపమగస గగ

గమపని గా
మపనిస మా
పనిసగ నీ స పా ని మా ప గా మ సా గా మ
పప పమప నినిపమగస గగా
గమపని గమపని స మపనిసగని
గమపని గమపని స మపనిసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా
గామాపని గమాపాని స మపానీసగని
స పని మ ప గ మ సా గా మ
పప పమప నినిపమగస గ గా గా

గగ మమ పప నిగ.. తక తకిట తకధిమి
మమ పప నినిసమ.. తక తకిట తకధిమి
పపనినిసస గని.. తక తకిట తకధిమి
సపని మప గమ సగమ
పప పమప నినిపమగస గ గా

రక్షా...  ధర శిక్షా దీక్షా దక్ష!
విరూపాక్ష! నీ కృపా వీక్షణాపేక్షిత ప్రతీక్షనుపేక్ష సేయక..
పరీక్ష సేయక.. రక్ష.. రక్ష.. యను ప్రార్ధన వినరా!
ఆనతినీయరా...  హరా!
సన్నుతి సేయగా.. సమ్మతి నీయరా దొరా...
సన్నిధి చేరగా.... ఆనతి నీయరా.... హరా


3 comments:

వేణూ శ్రీకాంత్ గారు,
పై లిరిక్ లోని స్వరాలాపన
భాగాలను నా గీతం "సాయివి నీవురా"
గీతం లోని ఆ భాగాలతో మిక్స్ చేసుకోవడానికి
దయతో అనుమతినిప్పించ గలరు ...
ముందస్తు కృతజ్ఞతలు ...

సోనైస్ ఆఫ్ యూ రావ్ గారు... నన్ను అడగాల్సిన అవసరమే లేదండీ.. హాయిగా ఉపయోగించుకోండి.. నేను కేవలం టైప్ చేసి ఇక్కడ షేర్ చేశానే తప్ప నాకు ఏవిధమైన హక్కులేదు వాటిపై..

వేణూ శ్రీకాంత్ గారూ,
నా గీతాన్ని చూసి ఎంత వరకు సఫలీకృతుడనయ్యానన్న మీ అభిప్రాయాన్ని దయతో తెలుపగలరు ...

https://nmraobandi.blogspot.com/2018/10/karaoke-compatible-imitation-song.html

మరొక్క సారి మీ సహృదయతకు ధన్యవాదాలు ...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.