శుక్రవారం, మే 26, 2017

అదిగదిగొ మొదలైంది వారధి...

బాలరామాయణం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బాలరామాయణం (1997)
సంగీతం : మాధవపెద్ది సురేష్
సాహిత్యం : మల్లెమాల
గానం : బాలు

అదిగదిగొ మొదలైంది వారధి..
రామాయణానికది సారధి
అదిగదిగొ మొదలైంది వారధి..
రామాయణానికది సారధి

శ్రీరామ నామం పునాదిగా
సీతమ్మ కడగళ్ళు రాళ్ళుగా
లోకకళ్యాణమై రూపొందుచున్నట్టి
వారధే మనపాలి పెన్నిధీ

అదిగదిగొ మొదలైంది వారధి..
రామాయణానికది సారధి

అధినేత సుగ్రీవు ఆజ్ఞపాటించీ
హనుమ అంగదులాది వేలాది వానరులు
పగలేంది రేయేంది
పగలేంది రేయేంది పని మనకు
ముఖ్యమని పాటు పడుచుండగా

అదిగదిగొ సగమైంది వారధి..
రామాయణానికది సారధి

ఇంతలో ఒక ఉడుత ఇటు అటును పొర్లాడి
రాళ్ళ మధ్యను ఇసుక రాల్చుటను గమనించి
చందగల గిరులు విరిబంతులై పైకెగసి
కపులు నివ్వెరపోవ కడలిపై వాలాయి

అదిగదిగొ పూర్తైంది వారధి..
రామాయణానికది సారధి
రామాయణానికది సారధి



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.