దేవుళ్ళు చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : దేవుళ్ళు (2000)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : జొన్నవిత్తుల
గానం : చిత్ర, స్వర్ణలత
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం
గోరు ముద్దలెరుగని బాల కృష్ణులం
బాధ పైకి చెప్పలేని బాల ఏసులం
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం..
మీ ఒడిని ఆడే చందమామలం..
కమ్మగా.. మా అమ్మ చేతితో..
ఏ పూట తింటామో ఏడాదిలో..
చక్కగా.. మా నాన్న పక్కగా..
సరదాగ తిరిగేది ఏ నాటికో
పొద్దున్నే పరుగున వెళతారూ...
రాతిరికి ఎపుడో వస్తారూ
మరి మరి అడిగినా.. కథలు చెప్పరూ
మేమేం చెప్పినా.. మనసు పెట్టరూ
అమ్మ నాన్న తీరు మాకు అర్ధమవ్వదూ
ఏం చెయ్యాలో మాకు దిక్కు తోచదూ..
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా..
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం
మీ ఒడిని ఆడే చందమామలం
పిల్లలం.. మీ చేతి ప్రమిదలం
మీ ప్రేమ చమురుతో.. వెలుగు దివ్వెలం
పువ్వులం.. మీ ఇంటి నవ్వులం
మీ గుండెపై ఆడు.. చిన్ని గువ్వలం
కని పెంచే మీరే దేవుళ్లూ
కనిపించే శివుడూ పార్వతులూ
లోకం బూచికి మా గుండే వణికితే
మాకు ధైర్యం ఇచ్చేది మీ లాలింపే
అమ్మ.. నాన్నలిద్దరూ వేరు వేరయీ
అనాధలను చెయ్యకండి పసి పిల్లలని
ఆలోచించండి ఓ అమ్మా.. నాన్నా
ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా
మీ ప్రేమ కోరే చిన్నారులం..
మీ ఒడిని ఆడే చందమామలం
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.