మంగళవారం, డిసెంబర్ 05, 2017

జాగో జాగోరె జాగో...

శ్రీమంతుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : శ్రీమంతుడు (2015)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రఘు దీక్షిత్ & రీట

నేల నేల నేలా నవ్వూతోంది నాలా
నట్ట నడి పొద్దు సూరీడులా
వేల వేల వేలా సైన్యమై ఇవ్వాళా
దూసుకెళ్ళమంది నాలో కల
సర్ర సరా సరా ఆకాశం కోసెశా
రెండు రెక్కలు తొడిగేశా
గిర్ర గిర గిర్ర భూగోళం చుట్టురా
గుర్రాల వేగంతో తిరిగేశా
ఏ కొంచెం కల్తీ లేని కొత్త చిరుగాలై
ఎగరేశా సంతోషాల జెండా జెండా

జాగో జాగోరె జాగో జాగోరె జాగో జాగోరె జాగో
జాగో జాగోరె జాగో జాగోరె జాగో జాగోరె జాగో

వెతికా నన్ను నేను.. దొరికా నాకు నేను..
నాలో నేనె ఎన్నోవేల వేల మైళ్ళు తిరిగీ
పంచేస్తాను నన్ను.. పరిచేస్తాను నన్ను..
ఎనిమిది దిక్కులన్ని పొంగిపోయే ప్రేమై వెలిగీ
ఘుమ్మ ఘుమ ఘుమ గుండెల్ని తాకెలా
గాంధాల గాలల్లే వస్తా
కొమ్మ కొమ్మా రెమ్మా పచ్చంగా నవ్వేలా
పన్నీటి జల్లుల్నే తెస్తా
ఎడారి ని కడలిగా చేస్తా..చేస్తా

జాగో జాగోరె జాగో జాగోరె జాగో జాగోరె జాగో
జాగో జాగోరె జాగో జాగోరె జాగో జాగోరె జాగో


స్వార్ధం లేని చెట్టూ బదులే కోరనంటూ
పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే
ఏమీ పట్టనట్టు బంధం తెంచుకుంటూ
మనిషే సాటి మనిషని చూడకుంటే అర్థం లేదే
సల్ల సలా సలా పొంగిందే నారక్తం
నా చుట్టూ కన్నీరే కంటే
విల్ల విల్లా విల్లా అల్లాడిందే ప్రాణం
చేతైనా మంచే చెయ్యకుంటే
ఇవ్వాలనిపించదా ఇస్తూ ఉంటే

జాగో జాగోరె జాగో జాగోరె జాగో జాగోరె జాగో
జాగో జాగోరె జాగో జాగోరె జాగో జాగోరె జాగో


1 comments:

స్వార్ధం లేని చెట్టూ బదులే కోరనంటూ
పూలు పళ్ళు నీకు నాకు ఎన్నో పంచుతుందే
ఏమీ పట్టనట్టు బంధం తెంచుకుంటూ
మనిషే సాటి మనిషని చూడకుంటే అర్థం లేదే

Excellent lines by Ramajogayya ssastri garu.. 👌👌👌👌👌

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.