శుక్రవారం, డిసెంబర్ 08, 2017

నేను సైతం ప్రపంచాగ్నికి...

ఠాగూర్ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఆడియో ఇక్కడ చూడవచ్చు. వీడియో ఇక్కడ చూడచ్చు.


చిత్రం : ఠాగూర్ (2003)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : బాలు

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి
అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోసానూ

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను


అగ్నినేత్ర ఉగ్ర జ్వాల దాచినా ఓ రుద్రుడా
అగ్ని శిఖలను గుండెలోనా అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశమా
హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా
భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా

అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
కనులు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వృష్టికి
అశ్రువొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు
వెర్రి గొంతుక విచ్చి మ్రోసానూ

నేను సైతం ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.