శనివారం, డిసెంబర్ 02, 2017

ఒకే ఒక జీవితం...

మిస్టర్ నూకయ్య చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మిస్టర్ నూకయ్య (2012)
సంగీతం : యువన్ శంకర్ రాజా
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : హరిచరణ్

ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు
మళ్లీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు
కష్టమనేది లేని రోజంటూ లేదు కదా
కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా

హో ఓ ఓ అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
హో ఓ ఓ ఆనందం కోసమే ఈ పరుగు
హో ఓ ఓ కష్టాల బాటలో కడ వరకు
హో ఓ ఓ చిరునవ్వు వదలకు

నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు
నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు
ఇది మంచి అని అది చెడ్డదని
తూకాలు వేయగల వారెవరు
అందరికి చివరాకరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు
అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు
దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా
తలో పాత్ర వేయకుంటే కాల యాత్ర కదిలేనా

హో ఓ ఓ నడి సంద్రమందు దిగి నిలిచాకా
హో ఓ ఓ ఎదురీదకుండ మునకేస్తావా
హో ఓ ఓ నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని
హో ఓ ఓ అద్దరికి చేర్చవా

పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో తన తోడెవరు నడవరులే
చీకటిలో నిశి రాతిరిలో నీ నీడ కూడా నిను వదులునులే
నీ వారను వారెవరు లేరంటూ నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే చివరంట నీతో నువ్వే
చుట్టూ ఉన్న లోకమంత నీతో లేనే లేదనుకో
నీకన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో

హో ఓ ఓ లోకాన నమ్మకం లేదసలే
హో ఓ ఓ దాని పేరు మోసమై మారేనులే
హో ఓ ఓ వేరెవరి సాయమో ఎందుకులే
హో ఓ ఓ నిన్ను నువ్వు నమ్ముకో

2 comments:

Excellent song and excellent lyrics by Ramajogayya Garu..

Sir.. 'Raja Cheyi vesthe' movie Loni "nee thone undi ee prapancham' song lyrics post cheyandi..aa song kuda inspirational ga untundi..

థాంక్స్ శ్రీనివాస్ గారు తప్పక పోస్ట్ చేస్తానండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.