మంగళవారం, డిసెంబర్ 12, 2017

చల్ చలో చలో...

సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు మనం తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : సన్నాఫ్ సత్యమూర్తి (2015)
సంగీతం : దేవిశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : రఘు దీక్షిత్, సూరజ్ సంతోష్

రాజ్యం గెలిసినోడు రాజవుతాడూ
రాజ్యం ఇడిసినోడే రామచంద్రుడూ
యుద్ధం గెలిసేటోడు వీరుడు శూరుడూ
యుద్ధం ఇడిసేటోడే దేవుడూ

చల్ చలో చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించుదారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో
తీపితోపాటుగా ఓ కొంత చేదు
అందించడం జిందగీకి అలవాటే
కష్టమే రాదనే గ్యారంటీ లేదు
పడేసి పరుగు నేర్పు ఆటె బ్రతుకంటే
అందుకో హత్తుకో ముందరున్న ఈక్షణాన్ని

చల్ చలో చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించుదారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయ్
తీయగుంటే కడదాకా వదలవుగనక
కష్టాలెందుకు బరువుగుంటాయ్
తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవుగనక
ఎదురేలేని నీకుగాక
ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక
చూద్దాం అంటూ నీ తడాఖా
వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటిగడపదాక
పడ్డవాడే కష్టపడ్డవాడే పైకిలేచే ప్రతోడూ
ఒక్కడైనా కానరాడే జీవితాన్ని
పోరాడకుండ గెలిచినోడు

చల్ చలో చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించుదారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

మడతేనలగని షర్ట్ లాగా
అల్మరాలో పడివుంటే అర్ధంలేదు
గీతేతగలని కాగితంలా 
ఒట్టిచెదలు పట్టిపోతే ఫలితం లేనేలేదు
పుడుతూనే గుక్కపట్టినాక 
కష్టమన్న మాటే నీకు కొత్తేం కాదు
కొమ్మల్లో పడి చిక్కుకోకా 
ఆకాశం ఎత్తుల్లో ఏ గాలిపటం ఎగరలేదు 
ప్లస్సుకాదూ మైనస్సుకాదూ
అనుభవాలే ఏవైనా
ఓర్చుకుంటూ నేర్చుకుంటూ
సాగిపోరా నీదైన గెలుపుదారిలోన

చల్ చలో చలో లైఫ్ సే మిలో
ఇదో కొత్త ఛాప్టర్ జస్ట్ సే హలో
చల్ చలో చలో చలించుదారిలో
ప్రతి ఒక్క ఛాలెంజ్ ఫేస్ చెయ్యరో

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.