శుక్రవారం, మార్చి 14, 2014

నిగ్గదీసి అడుగు...

కాస్త పెసిమిస్టిక్ గా అనిపించినా ఇరవై ఏళ్ళ క్రితం సిరివెన్నెల గారు రాసిన ఈ పాట నేటికీ వర్తిస్తుంది క్యాలెండర్లు మారుతున్నాయే కానీ పరిస్థితులు మారట్లేదు. సమాజం ఉన్న పరిస్థితిని స్పష్టంగా కళ్ళముందు నిలిపే ఈ పాట నాకు చాలా ఇష్టం. ఈ పాటని సిరివెన్నెల గారిపై చిత్రీకరించాలనుకోవడం ఒక మంచి ఐడియా కవి ఆవేశాన్ని మరింత ప్రభావవంతంగా నేరుగా ప్రేక్షకులకు చేరవేయగలిగాడు దర్శకుడు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
 


చిత్రం : గాయం (1995) 
సంగీతం : శ్రీ 
సాహిత్యం : సిరివెన్నెల 
గానం : బాలు 

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం


గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
 
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం


పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

రాజకీయ రంగప్రవేశం గురించి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ కు ఒక అభిమానిగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూన్నాను. తరచుగా తన మాటలలో వినిపించే నీతి నిజాయితీలు తన చేతలలో కూడా కనిపించాలనీ, పార్టీ ప్రారంభిస్తే అది ఆరంభ శూరత్వంలా కాక తన ఆశయాలకు తగిన స్పష్టమైన విధివిధానాలను వెల్లడించి వాటిని తూచ తప్పక ఆచరించాలని కోరుకుంటున్నాను.

5 comments:

రాజకీయ రంగప్రవేశం గురించి ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్ కు ఒక అభిమానిగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూన్నాను. తరచుగా తన మాటలలో వినిపించే నీతి నిజాయితీలు తన చేతలలో కూడా కనిపించాలనీ, పార్టీ ప్రారంభిస్తే అది ఆరంభ శూరత్వంలా కాక తన ఆశయాలకు తగిన స్పష్టమైన విధివిధానాలను వెల్లడించి వాటిని తూచ తప్పక ఆచరించాలని కోరుకుంటున్నాను.>>>

బింగో..

పార్టీ పరం గా యెంత సక్సెస్ అయ్యారన్నది పక్కన పెడితె,మొదట్లో అరవింద్ కేజ్రీవాల్ గుడ్ థాట్ ప్రోసెస్ ని యెటువంటి వక్ర భాష్యాలూ లేకుండా ఫోకస్ చేసింది నేషనల్ మీడియ..నిన్న పవన్ ప్రసంగం లో యువతకి ఇన్స్ పిరేషన్ కలిగించే యెన్నో మంచి విషయాలున్నాయి..అవన్నీ వదిలేసి కేవలం అతని మూడో పెళ్లి, అతని ఫామిలీలో చీలికలనీ మాత్రమే ఫోకస్ చేసిన, చేస్తున్న, మన మీడియాకి, సో కాల్డ్ పొలిటీషియన్స్ కీ, మీ సాంగ్ చాలా యాప్ట్ వేణూజీ..

మన రాజకీయాలలో వేలకోట్లరూపాయలు దోచుకుంటే తప్పు లేదు కాని మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం తప్పు. దేని వలన జనానికి ఎక్కువ నష్టం జరిగిందో పట్టించుకోరు.

థాంక్స్ రాజ్,
థాంక్స్ లక్ష్మణ్ గారు,
థాంక్స్ శాంతి గారు కరెక్టండీ.. చూద్దాంలెండి చెప్పగా చెప్పగా మీడియా అండ్ కొందరు పొలిటీషియన్స్ కూడా తమ ధోరణి మార్చుకోవచ్చేమో.
థాంక్స్ బోనగిరి గారు, అంత ఆలోచనే ఉంటే ఇంకేమండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.