ఆదివారం, మార్చి 16, 2014

అందాలొలికే సుందరి...

ఈ సినిమా విడుదలైనపుడు ఈ పాటలు ఎంత ప్రాచుర్యాన్ని పొందాయో మాటలలో చెప్పడం కష్టమేనేమో... మొత్తం స్టేట్ అంతటినీ ఒక ఊపు ఊపేసిన పాటలు. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందించిన టి.రాజేందర్ ఒక ముఖ్యపాత్ర కూడా పోషించారు. ఎవరా రాజేందర్ అంటారా ధైర్యమున్నవాళ్ళు ఈ ఫైట్ సీన్ చూసి తెలుసుకోండి. కానీ ఏమాటకామాటే చెప్పుకోవాలి ఈ పాటతో పాటు ఈ సినిమాలోని మరికొన్ని పాటలు కూడా బాగుంటాయి. రేపు హోలీ సెలెబ్రేషన్స్ మొదలెట్టే ముందు ఈ కలర్ ఫుల్ పాట చూసి విని ఆనందించండి. ఆడియో మాత్రమే వినాలనుకున్న వాళ్ళు ఇక్కడ లేదా ఇక్కడ వినవచ్చు. 



చిత్రం :  ప్రేమసాగరం (1983)
సంగీతం : టి. రాజేందర్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, శైలజ

ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్
ఏలేలమ్మ ఏలేలమ్మ ఏలేలమ్మ హొయ్

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేను
రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ

గాలుల గారాలే చెలి కులుకున నిలిపినది
మెరుపుల మిసమిసలే మేఘాలకు తెలిపినది
ముద్దు మోములో కొటి మోహములు 
చిలికేను నా చెలి కనులే
సింధు భైరవిని చిలక పలుకుల 
దోర పెదవులే పలికే..ఏ..ఏ...
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
ప్రేమ యువకుల పాలిట ఒక వరం
అది వలచిన మనసుల అభినయం
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేనూ

అప్సరా ఆడెనే... అందలే మ్రోగెనే
మరులు విరిసి పలకరించె మనసు
కలలు మురిసి పులకరించె వయసు
కన్నులు కులికెను కవితలు పలికెను
పాదము కదిలెను భావము తెలిసెను
అదే కదా అనుక్షణం చెరగని
సల్లాపమే ఉల్లాసమే ఆ నగవూ..

మోహము కొనసాగే తొలి మోజులు చెలరేగే
నా పాటకు పల్లవిలా చెలి పొంగెను వెల్లువలా
అమరవాణి ఇది అందాల గని ఇది నవతరానికే ఆధారం
మధుర మధుర సుకుమార ప్రణయ రసలోక తరంగిణి 
చెలి స్నేహం ఆ..ఆ..
పలవరింతలు రేపెను కోటీ ...ఆమె కెవరు లేరిక సాటీ
పలవరింతలు రేపెను కోటి ..ఆమె కెవరు లేరిక సాటి
లాలాలల లాలాలల
లాలాలల లాలాలల

అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేను
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే ఇచ్చేను

ఆఆఆ..రతి నీవే శశి నీవే సుధ నీవే దేవి
నీ తలపే నీ పిలుపే నీ వలపే నావి
అందాలొలికే సుందరి రాతిరి కలలో వచ్చేనూ
పున్నమి వెన్నెల వన్నెలు చిలికి మనసే దొచేనూ.. 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అన్నట్లు రేపు హోలీ కదా రంగులు సిద్దం చేసుకున్నారా.. లేకుంటే సహజ సిద్దమైన రంగులు (నాచురల్ కలర్స్) ఎలా తయారుచేస్కోవాలో ఈ వీడియోలో చూడండి. బీట్ రూట్, కాఫీ/టీ పొడి, ఆకు కూరలు, పసుపు + సెనగపిండి, కుంకుమ పువ్వు, బట్టలకు పెట్టే నీలిరంగు + సెనగపిండి లతో ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. 


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

అలాగే ఈ వీడియోలో నాచురల్ కలర్ పౌడర్స్ ఎలా తయారుచేస్కోవచ్చో చూపించారు, ఫుడ్ కలర్స్ ని వైట్ ఫ్లోర్ లేదా కార్న్ స్టార్చ్ తో కలిపి చేయచ్చట. మీకు ఇంకేవైనా తెలిసినా ఇక్కడ కామెంట్స్ లో పంచుకోండి. 

2 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.