బుధవారం, మార్చి 12, 2014

మనిషికో స్నేహం మనసుకో దాహం

ఇళయరాజా ఎవర్ లాస్టింగ్ మెలోడీస్ లో ఈ పాట కూడా ఒకటి. మొన్నటి సినిమాలోదే.. వెంటనే వేయాలనిపించి పోస్ట్ చేసేస్తున్నా. ఇలాంటి పాటల గురించి సాహిత్యం గురించి మాటలలో చెప్పడం కష్టం మీరూ ఆస్వాదించి అనుభూతి చెందడమే. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోండి.



చిత్రం : ఆత్మబంధువు (1985)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, జానకి

మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

ఒక చిలక ఒద్దికైంది.. మరు చిలక మచ్చికైంది
వయసేమో మరిచింది.. మనసొకటై కలిసింది
కట్టగట్టి ఆపాలన్నా గంగ పొంగులాగేనా
ప్రేమలేని నాడీ నేల పూవులిన్ని పూచేనా
మనిషిలేని నాడు దేవుడైనా లేడు
మంచిని కాచే వాడు దేవుడికి తోడు

మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం 

వయసు వయసు కలుసుకుంటే
పూరి గుడిసె రాచనగరు...
ఇచ్చుకోను ..పుచ్చుకోను..
ముద్దులుంటే పొద్దుచాలదు
ప్రేమ నీకు కావాలంటే పిరికివాడు కారాదు
గువ్వ గూడు కట్టే చోట కుంపటెట్టి పోరాదు
ఓర్వలేని సంఘం ఒప్పుకోదు నేస్తం
జాతి మత భేదాలన్నీ స్వార్థపరుల మోసం

మనిషికో స్నేహం మనసుకో దాహం
లేనిదే జీవం లేదు జీవితం కానే కాదు
మమతనే మధువు లేనిదే చేదు
మనిషికో స్నేహం మనసుకో దాహం

2 comments:

మనసు దాహాన్ని తీర్చగల స్నేహం దొరకడం చాలా అరుదు..అది తీరకే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇంత పాపులర్ అయ్యాయనిపిస్తుంది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.