అతని అందం, అమాయకత్వం, మంచితనం, కట్నంవద్దనే ఆదర్శం ఇవన్నీ చూసి తనకు తెలియకుండానే మనసిచ్చేసింది ఆ అమ్మాయి. కానీ అతనికి తను సరిజోడవగలనో లేదో మనసుకు భంగపాటు తప్పదేమో అనే సందేహంతో తొందరపడవద్దని తన మనసుకు ఈ పాటతో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది . రమేష్ నాయుడు గారి సంగీతంలో అమ్మాయి మనసును తనదిగా చేసుకుని వేటూరి గారు రాసిన ఈ పాట ఎంత చక్కగా ఉందో మీరే చూడండి. ఈ పాట మంచి క్వాలిటీ(HD) వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ లింక్ పనిచేయనివారు క్రింది ఎంబెడ్ వీడియో చూడచ్చు. ఆడియో హై క్వాలిటీ ఇక్కడ వినవచ్చు. ఆడియో వినాలంటె రాగాలో ఇక్కడ వినవచ్చు.
చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ (1984)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : జానకి
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
ఏమంత అందాలు కలవనీ
వస్తాడు నిన్ను వలచీ..
ఏమంత సిరి ఉంది నీకనీ
మురిసేను నిన్ను తలచీ..
చదువా.. పదవా.. ఏముంది నీకు
తళుకు.. కులుకు.. ఏదమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
ఏ నోము నోచావు నీవనీ
దొరికేను ఆ ప్రేమఫలమూ
ఏ దేవుడిస్తాడు నీకనీ
అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావొ లేదో
ఆ శుభఘడియా వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా.. తెలుసా
మనసా తుళ్ళిపడకే అతిగా ఆశపడకే
2 comments:
నేను, అక్క కలిసి ఈ సినిమాని 7సార్లు చూశాము వేణూజీ..ఒక్క సారిగా ఫ్లాష్ బాక్ లోకి తీసుకెళ్ళి పోయారు..
థాంక్స్ శాంతి గారు, నేను కూడా ఎక్కువసార్లు చూసిన సినిమా ఇది, ఇప్పటికీ అపుడపుడు రిఫ్రెష్ అవడానికి చూస్తుంటాను :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.