మంగళవారం, మార్చి 18, 2014

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు...

సిరివెన్నెల గారి మరో అందమైన పాట ఓ అల్లరి అమ్మాయి గురించి... నాకు చాలా ఇష్టమైన పాట మీరూ ఆస్వాదించండి చిత్రీకరణ సైతం చాలా బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.



చిత్రం : జోష్(2009)
సంగీతం : సందీప్ చౌతా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కార్తీక్

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నిన్నిప్పుడు చూస్తే చాలు 
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు 
మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీ లీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు 
చిత్రంగా నీవైపలా
పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు 
నీలాగా నలువైపులా
భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసీ
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి
చేదైనా తీపౌతుందే నీ సంతోషం చూసి
చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


నువ్వేం చూస్తున్నాఎంతో వింతల్లే అన్నీ 
గమనించే ఆశ్చర్యమా
యే పనిచేస్తున్నా ఎదో ఘనకార్యం లాగే 
గర్వించే పసిప్రాయమా
చుక్కలన్ని దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా
చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా
తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల

నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు

నిన్నిప్పుడు చూస్తే చాలు 
చిన్నప్పటి చిలిపి క్షణాలు
గుండెల్లో గువ్వల గుంపై వాలు
నీతో అడుగేస్తే చాలు 
మునుముందుకు సాగవు కాళ్ళు
ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు
కాలాన్నే తిప్పేసిందీలీలా
బాల్యాన్నేరప్పించిందీవేళా
పెద్దరికాలన్నీ చినబోయేలా
పొద్దెరగని మరుపేదో పెరిగేలా
 
నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు
ఏమౌతాయో ఎదిగిన ఇన్నేళ్ళు


2 comments:

ఈ పాట విన్నప్పుడల్లా.."చిన్నప్పటి ఆనందాలు-చిగురించిన మందారాలు" అన్న మల్లాది గారి కవిత గుర్తొస్తుందండీ..

ఓహ్ అవునా నాకాకవిత తెలీదండీ, థాంక్స్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.