బుధవారం, మార్చి 26, 2014

జాబిల్లి కోసం ఆకాశమల్లే...

తెలుగు శ్రోతలకు పరిచయం చేయాల్సిన అవసరంలేని అద్భుతమైన పాట, ఇళయరాజా, బాలు, ఆత్రేయల అపురూప సృష్టి, నాకు చాలా చాలా ఇష్టమైన పాట.. మీరూ విని ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు. 



చిత్రం : మంచిమనసులు (1986) 
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ

గానం : యస్.పి.బాలు 
 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
 
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పూవ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 

 
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
ఉండీ లేక ఉన్నది నువ్వే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే 

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై

8 comments:

I wish to see a post on the title song from the film "Neekosam" by Rajesh

$id

నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా... Superb lyrics:):)

Thanks Siddarth gaaru.. will post that song soon..

Thanks Karthik ji.

యెన్ని వేల, లక్షల పాటలు సినీ పూదోటలో పూసినా..ఇదే నా ఆల్ టైం ఫేవరెట్ సాంగ్ వేణూజీ..చూసిన, ఐ మీన్ విన్న వెంటనే..ఇదుగో నేనున్నానంటూ..వెచ్చగా నవ్వుతూ కన్నీటి చుక్క పెదవిని ఆప్యాయంగా పలుకరించింది..నవ్వినా యేడ్చినా కన్నీళ్ళే వస్తాయి అనే మాట లో యెంతో నిజముందని అనిపించిందండీ..బహుశా ఆ పాట పై నాకు గల మక్కువ వల్ల నేమో ఫొటో ఇంకా బావుండాలి అని అనిపించింది..

పైది బావుందండీ..కింద పిక్ గురించి నేను చెప్పినది..

థాంక్స్ శాంతి గారు, ఈ పాటపై మీకున్న అభిమానమంతా మీ మాటలలో కనిపిస్తుందండీ.

ఆ రెండవ పిక్ మార్చానండీ ఇపుడెలా ఉందో చెప్పండి శాంతి గారు.

చాలా, చాలా బావుందండీ..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.