శుక్రవారం, మార్చి 07, 2014

నీ రూపం చిత్రిస్తూనే..

విద్యాసాగర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట చాలా బాగుంటుంది, సినిమా మాంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అవడంతో అందరూ మెచ్చుకున్నవారే కానీ థియేటర్లో చూసినవారు తక్కువే దాంతో ఈ పాట కూడా పెద్ద ఆదరణకు నోచుకోలేదు. మీరూ చూసి ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : సత్యమే శివం (2003)
సంగీతం : విద్యాసాగర్
సాహిత్యం : వెన్నెలకంటి
గానం :  బాలు, గోపికాపూర్ణిమ

నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగ మారి నే నిను వలచా
వలపించు తలపే పిలుపైన వేళ
పలికింది నాలో సంగీతమే

ఆ గీతమే తియ్యగా పాడనా..ఆఆఆ..

నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగ మారి నే నిను వలచా

చుక్కలన్నీ ఒక్కటైతే చిత్రము
కళ్ళు కళ్ళు కలుసుకుంటే కావ్యము
గీతలన్ని చిత్రమందు భాగమే
మాటలన్నీ ప్రేమ ముందు మౌనమే

ఆ నింగి రంగు నీలమంటా
మన ప్రేమ రంగూ ఎమిటంటా
నీ కుంచెలకే చూపొచ్చి
రేఖలకే రూపొచ్చి
మన ప్రేమను చిత్రించేనా 

 
నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగా మారి నే నిను వలచా..

చిత్రమందు జీవమెక్కడున్నది 

చెలియ సోగ కళ్ళలోనే వున్నది
తనువులోన ప్రేమ ఎక్కడున్నది 

చూపు పడని చోట దాగి వున్నది
నీ చిత్రమందు ఓ చిత్రముంది
నీ మాటలోన మధుమంత్రముంది

తెలిమబ్బు తేరెక్కి ఇల చేరే జాబిలివా
జత చేర చెలియా నువ్వు రా..ఆఆ..

నీ రూపం చిత్రిస్తూనే నే మైమరచా
మైమరపే ప్రేమగ మారి నే నిను వలచా
వలపించు తలపే పిలుపైన వేళ
పలికింది నాలో సంగీతమే 

ఆ గీతమే తియ్యగా పాడనా ఆఆ...

6 comments:

Great effort. I came to know bunch of new songs through your site. Female voice for this doesn't sound like Chitra garu. Google search shows Gopika poornima.

-SJ


కమల్ సినిమాల్లో one of the best.

"కళ్ళు కళ్ళు కలుసుకుంటే కావ్యము" -- :) :)

"మాటలన్నీ ప్రేమ ముందు మౌనమే" -- ప్రేమలో మౌనం కూడా మాట్లాడుతుందని రసిక కవులందరూ అంటుంటే ఈయనేంటీ మాటలన్నీ మౌనమే అంటాడు !

థాంక్స్ వేణూ గారు :)

చాలా బావుందండి.ఇప్పుడే విన్నా మొదటి సారి ..థాంక్స్ వేణూ గారుRadika (nani)

థాంక్స్ SJ గారు సరిచేశాను. మీరు వినని పాటలను మీకు పరిచయం చేయగలిగినందుకు సంతోషం.

నాగార్జునా దట్స్ రైట్ ఒన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఆఫ్ కమల్. హహహ మాటలన్నీ మౌనమే అన్నా మౌనం మాట్లాడుతుందన్నా ఒకటే కదా :-) మరోసారి ఆలోచించు. థాంక్స్ ఫర్ ద కామెంట్.

ఓహ్ మీకో కొత్తపాట పరిచయం చేశాననమాట అయితే :-) థాంక్స్ రాధిక గారు.

మనిషి-సత్యం, మనుగడ-శివం, మానవత్వం-సుందరం..ఈ మూవీ చూశాక చాలాసేపు మౌనమై పోయాము..అద్భుతమైన సినిమా..అందమైన పాట వేణూజీ..

చక్కని భాష్యం చెప్పారు థాంక్స్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.