ఆదివారం, మార్చి 09, 2014

ముకుందా ముకుందా కృష్ణా

దశావతారంలోని ఈ ముకుందా.. ముకుందా పాట నేను తరచూ వినే పాటలలో ఒకటి. ఇదికూడా చక్కని సంగీత సాహిత్యాల మేళవింపు. ఆడియో క్రింది ప్లగిన్ లో లేదా ఇక్కడ వినండి.


 వీడియో ఇక్కడ చూడండి. 


చిత్రం : దశావతారం 
సంగీతం : హిమేష్ రేష్మియ 
సాహిత్యం : వేటూరి
గానం : సాధనసర్గమ్
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...

వెన్నదొంగవైనా..మన్నుతింటివా..
కన్నెగుండె ప్రేమ లయలా మృదంగానివా..
 
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...

 
జీవకోటి నీచేతి..తోలుబొమ్మలే..
నిన్ను తలచి ఆటలాడే కీలుబొమ్మలే..
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...

జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. జైజైరాం.. 
సీతారాం..జైజైరాం.. జైజైరాం.. జైజైరాం..

నీలాల నింగికింద తేలియాడు భూమి..
తనలోనే చూపించాడు..ఈ కృష్ణ స్వామి..
పడగవిప్పి మడుగునలేచే..సర్ప శీర్షమే ఎక్కి..
నాట్యమాడి కాళీయుని దర్పమణచినాడు...
నీ ధ్యానం చేయువేళ విఙ్ఞానమే ఇక.. 
అఙ్ఞానం రూపుమాపే కృష్ణ తత్వమేగ..
అట అర్జునుడొందెను..నీ దయవల్ల గీతోపదేశం..
జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం..
వేదాల సారమంతా వాసుదేవుడే..
రేపల్లె రాగం తానం రాజీవమే..
 
హే..ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందావనంలో వరంగా...


మత్స్యమల్లే నీటిని తేలి వేదములను కాచి..
కూర్మరూపధారివి నీవై భువినిమోసినావే..
వామనుడై పాదమునెత్తి నింగికొలిచినావే..
నరసింహుని అంశే నీవై హిరణ్యుని చీల్చావూ..
రావణుని తలలను కూల్చి రాముడివై నిలిచావు..
కృష్ణుడల్లే వేణువూది ప్రేమను పంచావు..
ఇక నీ అవతారాలెన్నెన్నున్నా..ఆధారం నేనై..
నీ ఒరవడి పట్టా..ముడిపడి ఉంటా ఏదేమైనా నేనే..
మదిలోని ప్రేమ నీదే మాధవుడా..
మందార పువ్వే నేను మనువాడరా..
 
ముకుందా..ముకుందా...కృష్ణా..ముకుందా..ముకుందా..
స్వరంలో తరంగా బృందా..వనంలో వరంగా...


2 comments:

అయ్యో నిన్నిక్కడ కామెంట్ రాసానండీ... ఏమైందీ.. రాసేసి పబ్లిష్ నొక్కడం మర్చిపోయి ఉంటాను...;(
మా అమ్మాయికీ నాకు బాగా ఇష్టం ఈ పాట. తన చిన్నప్పుడూ రోజూ రాత్రి పాడే జోలపాటల్లో ఇదీ కంపల్సరీ ఉండాల్సిందే! పాప కోసం ప్రత్యేకం లిరిక్స్ రాసుకుని మరీ నేర్చుకున్నా :)
sadhana sargam rocks!she is one of my favourite singers.

Oh Nice to know that తృష్ణ గారు :-)
సాధనా సర్గమ్ పాటలు బాగుంటాయండి.
నిన్న నాకు కూడా కామెంట్ గురించి నోటిఫికేషన్ ఏమీ రాలేదండీ మీరన్నట్లు పబ్లిష్ నొక్కి ఉండరు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.