ఆదివారం, మార్చి 02, 2014

నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..

అనూప్ రూబెన్స్ సంగీతంలో కొన్ని పాటలు భలే ఉంటాయి అదీ శ్రేయ పాడిందంటే ఇక మాట్లాడడానికి ఏముంటుంది పాట వింటూ మైమరచి పోవడం తప్ప :-) శ్రీమణి సాహిత్యం కూడా బాగుంటుంది. మీరూ ఆస్వాదించండి, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి.




చిత్రం : సుకుమారుడు (2013)
సంగీతం : అనూప్ రూబెన్స్
రచన : శ్రీమణి
గానం : శ్రేయ ఘోషల్

అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..
నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..
ఓహోహో..పొంగే నదిలా నన్నే మార్చావే..
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
హే..ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో..
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా.. ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా
అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..
ఓఓఓ..అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేఆ..

సరదాకైనా ఏ ఆడపిల్లైనా.. నిను చూస్తుంటే ఉండగలనా
నిన్నే దాచేసి లేవు పొమ్మంటా.. నీకే నిన్నే ఇవ్వనంటా
అరె.. నిన్నే తాకిందని గాలితోటి రోజూ గొడవేనంట
నిన్ను నువ్వైనా నాలాగ ప్రేమించలేవంట
అరే ఆరె అరెరెఅరే..అరే ఆరె అరెరెఅరేఆ.అరేరే..
హా..నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే

ఓ.. ఏలేలో..ఏలేలో..ఓఓ..

ఓఓఓ..రహదారుల్లో పూలు పూయిస్తా.. నా దారంటూ వస్తానంటే
మహరాణల్లే నన్ను చూపిస్తా.. నాపై కన్నే వేస్తానంటే
అరె ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం
ఇలా నువ్వంటే పడిచచ్చే నేనంటే నాకిష్టం

ఓ..నీలాకాశంలో మెరిసే చంద్రుడివే..
రివ్వున నేలకు జారి నాకై వచ్చావే
ఓహోహొ..పొంగే నదిలా నన్నే మార్చావే..
చిన్ని గుండెల్లోనా అలజడి రేపావే
ఏ..ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో..
చక్కిలి గింతలు మొదలాయే ఇక నా ఒడిలొ
నీవల్లే నీవల్లేరా సుకుమారా.. ఈ మాయే నీవల్లేరా
ఏదో అయ్యింది ఈవేళ ఇన్నాళ్ళు లేదిలా
ఓ.. ఏలేలో..ఏలేలో..ఓఓ..

6 comments:

యెలాగైనా సినీ కవులెప్పుడూ అమ్మాయి ప్రేమని తెలిపే (సొలో) పాటలు యెక్కువగా రాస్తారెందుకో..ఈ పాట
ఇదే మొదటి సారి వినడం.

గుడ్ అబ్సర్వేషన్ శాంతి గారు, ఈ మధ్య మరీ ఎక్కువైందండీ ఇలాంటి పాటల ప్రవాహం అబ్బాయిలమీద కూడా తీస్తారు కానీ ఇంత అందంగా ఉండవు :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.