సోమవారం, జూన్ 02, 2014

రహస్యముగా.. రహస్యముగా...

మణిరత్నం నిర్మించిన "డుండుండుం" సినిమా కోసం కార్తీక్ రాజా స్వరపరచిన ఈ వేటూరి వారి గీతం చాలా చక్కనైన ట్యూన్ లో ఆకట్టుకునేలా ఉంటుంది. హీరో హీరోయిన్లకి హిందూ, క్రిస్టియన్, ముస్లిమ్ ఈ మూడు పద్దతులలోనూ జరిగే పెళ్ళి సన్నివేశాలతో చిత్రీకరించటం బాగుంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేయవచ్చు.



చిత్రం : డుండుండుం(2001)
సంగీతం : కార్తీక్ రాజా
రచన : వేటూరి
గానం : టి.కె.కార్తీక్, స్వర్ణలత 
 
రహస్యముగా.. రహస్యముగా 
పూత నవ్వులో పొంగులెందుకో.. 
రహస్యముగా.. రహస్యముగా 
పూత నవ్వులో పొంగులెందుకో.. 
గొంతు విడిచి మాట శిథిలం..
గుండుసూది గిచ్చు ఫలితం..
చిగురాకు లేత హృదయం 
బరువేమో కొండశిఖరం.. 
చిలికి చిలికి నవ్వుతూ 
చిక్కుతుంది నిండు పరువం 
ఓ..హో..హో..ఓ..హో..హో..ఓ..హో..హో.. 

రహస్యముగా.. రహస్యముగా 
పూత నవ్వులో పొంగులెందుకో.. 
అతిశయమో.. అభినయమో..
మూగనవ్వులా ముచ్చటేమిటో..
గొంతు విడిచి మాట శిథిలం..
గుండుసూది గిచ్చు ఫలితం..
చిగురాకు లేత హృదయం 
బరువేమో కొండశిఖరం.. 
చిలికి చిలికి నవ్వుతూ 
చిక్కుతుంది నిండు పరువం 
ఓ..హో..హో..ఓ.హో..హో..ఓ..హో..హో..

నేలనీరు గాలికే విద్యుల్లత కొట్టెనమ్మా 
ఘాటు లేత ప్రణయమే ప్రపంచాలు దాటెనమ్మా 
  నిజమే నీవొచ్చి తాకితే.. 
నిజమే నీగాలి సోకితే.. మంచుల ముద్దగా నిలవనా
వెలుగై నీచూపు సోకితే నురగై నీలోన కరగనా.. 
చెలీ.. ఎదలాగే సొదలాగ చేసే గడబిడలెన్నో
ఓ..హో..హో..ఓ..హో..హో..ఓ..హో..హో..

అతిశయమో.. అభినయమో..
మూగనవ్వులా ముచ్చటేమిటో..
అతిశయమో.. అభినయమో..
మూగనవ్వులా ముచ్చటేమిటో..

దిరిదిరితాంతం ధిరిధిరితాం.. 
దిరిదిరితాంతం ధిరిధిరితాం.. 
దిరిదిరితాంతం ధిరిధిరితాం.. 
ఓ..ఓ..ఓ..ఓఓ...

తెల్లనైన పత్రమై ఈ హృదయం ఉందిలే 
మెత్తనైన నీ వేళ్ళూ కన్నె ఎదనె అడిగినే
ఒకనాటివా కాదు వాంఛలు తెరచాటు కోరేటి ఆశలు 
వలపై తలుపే తీయగా 
మరునాడె అవి నా ఇంటిలో అధికారమై చలించెనూ 
అదియో.. అది ఇదియో ఇది ఎదియో అదే నా అనురాగం.. 

రహస్యముగా.. రహస్యముగా 
పూత నవ్వులో పొంగులెందుకో.. 
అతిశయమో.. అభినయమో..
మూగనవ్వులా ముచ్చటేమిటో..
గొంతు విడిచి మాట శిథిలం..
గుండుసూది గిచ్చు ఫలితం..
చిగురాకు లేత హృదయం 
బరువేమో కొండశిఖరం.. 
చిలికి చిలికి నవ్వుతూ 
చిక్కుతుంది నిండు పరువం 
ఓ..హో..హో..ఓ.హో..హో..ఓ..హో..హో.. 
 

6 comments:

ఈ సినిమా, ఈ పాట, మాధవన్, జ్యోతికా అన్నీ బావుంటాయి అమృతం గారూ. గుర్తు చేసినందుకు థాంక్యూ...

ప్లెజర్ ఈజ్ మైన్ స్ఫురిత గారు, థాంక్స్ ఫర్ ద కామెంట్ :)

ఎంత అందమైన రహస్యం..భలే పాట..

థాంక్స్ శాంతి గారు :-)

This movie was a flop but few songs are beautifully composed. I like to listen to the original version of all dubbed songs (although my Tamil knowledge is limited). I like the following song from the same movie.

http://www.youtube.com/watch?v=tUhh6P9O05g

$

థాంక్స్ సిద్ గారు.. అవునండీ ఇందులో ఇంకా కొన్ని పాటలు కూడా బాగుంటాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.